ఉగాది నుండి ఏలినాటి శని, అర్దాష్టమ శనితో వీరికి నరకమే!
మార్చి 30 వ తేదీన ఉగాది పండుగను జరుపుకోబోతున్నాం. ఈ ఉగాది పండుగ నుండి ముఖ్య గ్రహాల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాలలో ప్రభావం ఉండబోతుంది. ఉగాది తర్వాత వచ్చే తెలుగు సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువగాను, ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
ఉగాది నుండి ఈ రాశులవారిపై ఏలినాటి శని, అర్దాష్టమ శని ప్రభావం
ఆదాయం తక్కువగా ఖర్చు ఎక్కువగా ఉన్నవారు విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఏ రాశుల వారు ఏలినాటి శని, అర్దాష్టమ, అష్టమ శని బారిన పడుతున్నారు. ఏ ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఉగాది నుండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేష రాశి వారికి ఆదాయం, రెండు వ్యయం 14 గా ఉంటుంది. ఆదాయానికి మించిన డబ్బులను ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఇక వీరికి ఉగాది నుంచి ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతగా పొదుపు చేయడం నేర్చుకోవాలి.
సింహరాశి
ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 వ్యయం 11 గా ఉంటుంది. ఈ రాశి వాళ్ళ చేతుల్లో ఈ ఏడాది ఖర్చులే ఎక్కువ ఉంటాయి. ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కావడం వల్ల చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఖర్చయిపోతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం కనిపిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఆదాయం 2 వ్యయం 14 గా ఉంటుంది. వీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మే 25వ తేదీన గురువు అష్టమ స్థానం లోకి మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టార్జితం కూడా వృధా అవుతుంది. మీరు తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకుంటే మంచిది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం ఆదాయం 5 వ్యయం 5 ఉండడం వల్ల ఆర్దికంగా ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి అర్దాష్టమ శని కారణంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. వీలైనంతగా వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. మే 25వ తేదీన గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆదాయం విషయంలో పెద్దగా పురోగతి ఉండదు. కాబట్టి జాగ్రత్త.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14. వీరికి కూడా కొత్త సంవత్సరంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉగాది తర్వాత ధనస్థానంలో శని ప్రవేశించడం కారణంగా ఆదాయ మార్గాలు బాగా తగ్గుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5. మీన రాశి వారు ఏలినాటి శని కారణంగా ఉగాది తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరికి ఈ సమయంలో కష్టాలు చుట్టుముడతాయి. కనుక మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచన.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications