ఏప్రిల్ లో ధనవంతులయ్యేది వీరే.. దండోరా వేసి చెప్పిన గజకేసరి రాజయోగం!
జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన శుభప్రదమైన యోగంగా గజకేసరి రాజయోగం చెప్పబడుతుంది. గ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు జరిగే సంయోగం కారణంగా అనేక యోగాలను ఏర్పరుస్తాయి. ఈ క్రమంలోనే గజకేసరి రాజయోగం బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఏప్రిల్ లో బృహస్పతి చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
గజకేసరి రాజయోగం
ఏప్రిల్ మాసంలో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. చంద్రుడు బృహస్పతి కలయిక కారణంగా శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

వృషభ రాశి
గజకేసరి రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంతోషాలను పొందుతారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. వృత్తి జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. అనవసర ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవుతుంది . జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
కన్యారాశి
గజకేసరి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు అన్ని విధాల శుభాలు చేకూరుతాయి. కన్యా రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు వస్తాయి. కన్య రాశి వారి ఆధ్యాత్మిక పెరుగుతుంది. కన్యారాశి జాతకులకు నూతన పెట్టుబడులు బాగా లాభాలను తెచ్చి పెడతాయి. కన్యారాశి జాతకులకు శత్రువుల బాధలు తగ్గుతాయి.
సింహరాశి
సింహరాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా కలిసి వస్తుంది. సింహ రాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు ఏ పని చేసినా కూడా వీరికి సానుకూల ఫలితాలే వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు గజకేసరి రాజయోగం విశేషమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా చేస్తుంది. జీవిత భాగస్వామితోను, కుటుంబంతో సంతోషంగా జీవించేలా గజకేసరి రాజయోగం ఆశీర్వదిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారాలలో వీరికి మంచి పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఇప్పుడు సంతోషంగా ఉంటారు. జీవితంలో సంతోషం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications