త్వరలో నక్కతోక తొక్కే రాశులివే.. ప్రకటించిన గజకేసరి రాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడేటువంటి యోగాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా కొన్ని అశుభ యోగాలు. ఇక ఫిబ్రవరి మాసంలో కూడా కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి.
ఫిబ్రవరిలో గజకేసరి రాజయోగం
ఫిబ్రవరి 6వ తేదీ అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వాళ్లు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఫిబ్రవరి మాసంలో గజకేసరి రాజయోగం కారణంగా ఆకస్మిక ధన లాభాన్ని పొంది కోటీశ్వరులు అయ్యే ఆ రాశుల వారు ఎవరో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
గజకేసరి రాజయోగం కారణంగా సింహరాశి వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి వారి కుటుంబజీవితం సంతోషదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఏ పని చేసిన విజయం ప్రాప్తిస్తుంది. వివిధ మార్గాల్లో ధనార్జన కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇది సింహరాశి వారికి శుభఫలితాలను ఇచ్చే కాలం.
తులారాశి
తుల రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంతో ఈ సమయంలో తులా రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వ్యాపారాలు చేసేవారు లాభాలనుగా గడిస్తారు. ఆర్థికంగా పురోగమనం చెందుతారు. ఆరోగ్యం బాగుంటుంది .మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. కొత్త ప్రాజెక్టులు కూడా మీకు మంచి పురోగతికి కారణం అవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తెస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే మెరుగవుతాయి. ఎప్పటినుంచో ఉన్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. కర్కాటక రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. అన్ని విధాలా ఇది కర్కాటక రాశి వారికి మంచి సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications