దీపావళి నుండి లక్ష్మీనారాయణ రాజయోగంతో ఆరునెలలు నక్కతోక తొక్కేది వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి పండుగ నాడు అనేక యోగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఇక దీపావళి పండుగ నాడు ఏర్పడే విశేష యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు వస్తాయని చెబుతారు. దీపావళి నాడు ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం దీపావళి నుండి ఆరు నెలల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వారి కష్టాలన్నీ తీరిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా దీపావళి నుండి వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది .ఈ రాశి వారు ఊహించని లాభాలను ఈ సమయంలో పొందుతారు. ఆరునెలల పాటు అన్నింటా విజయాలను అందుకుంటారు. డబ్బుకు, సంతోషానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ సమయంలో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి.

మిధున రాశి
దీపావళి నుండి ఆరునెలల పాటు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వీరికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిధున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి అన్నింటా విజయాలు లభించే అవకాశం ఉంది. రావలసిన ధనం మీకు చేతికి అందుతుంది.
తులారాశి
దీపావళి నుండి ఆరునెలల పాటు తులా రాశి జాతకులు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో వీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకున్న విజయాలను సాధించి తులా రాశి జాతకులు సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి
దీపావళి నుండి ఆరు నెలల పాటు ధనుస్సు రాశి జాతకులకు లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచి సమయం. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభరాశి
దీపావళి నుండి ఆరు నెలలపాటు సింహ రాశి జాతకులు లక్ష్మీనారాయణ రాజయోగం తో అదృష్టాన్ని పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటినుంచో పరిష్కారం కానీ సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications