నవంబర్ లో శుక్రాదిత్య రాజయోగంతో వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం చేస్తూ వివిధ గ్రహాలతో సంయోగం చెందుతూ ఏర్పరిచే రాజయోగాలు కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవంబర్ మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. నవంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
నవంబర్ లో శుక్రాదిత్య రాజయోగం
నవంబర్లో శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. అక్టోబర్ 17వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట 36 నిమిషాలకు సూర్యుడు తులారాశిలో ప్రవేశించి మళ్లీ నవంబర్ 17వ తేదీవరకు తులారాశి లోనే ఉంటాడు. ఇక నవంబర్ 2వ తేదీన మధ్యాహ్నం1.05 నిమిషాలకు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శుక్ర సూర్యుల సంయోగం జరుగుతుంది. ఫలితంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి శుక్రాదిత్య రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రాజయోగం కర్కాటకరాశిలో నాలుగవ స్థానంలో ఏర్పడడం వల్ల కర్కాటకరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు .కర్కాటకరాశి వారు ఈ సమయంలో వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారం చేసేవారు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచిసమయం. ఇంట్లో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లి ద్వారా డబ్బు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కన్యారాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశిలో ధన మరియు వాక్కు స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వీరు ఆకస్మిక ధన లాభాలను చూస్తారు. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వివిధ రంగాలలో పనిచేసే వారు విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సురాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో ధనుస్సురాశి వారికి ఆదాయ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ధనుస్సురాశిలో ఆదాయ మరియు లాభ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వ్యాపారాలను విస్తరించడానికి అవకాశం ఉంది. వివిధ పెట్టుబడుల నుండి ప్రయోజనాలు వస్తాయి. స్టాక్ మార్కెట్, లాటరీ, బెట్టింగ్ వంటి వాటినుండి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications