2025లో 11నెలలు ఈ రాశులకు చుక్కలే.. శాపమిచ్చిన గ్రహాలు!
2025 సంవత్సరంలో శని, బృహస్పతి, రాహువు, కేతువు తమరాశిని మార్చుకుంటున్నారు. మొత్తం నవగ్రహాలు 2025 సంవత్సరంలో చేసే సంచారం అన్ని రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ఇక శని, బృహస్పతి, రాహు, కేతువుల సంచారం 2025 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం 11 నెలపాటు ఇబ్బంది పడబోతున్న ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఆ వివరాలలోకి వెళితే..
మేష రాశి
మేష రాశి వారికి 2025 సంవత్సరం కష్టాలతో సాగుతుంది. శని సంచారం కారణంగా మేషరాశిలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చు చేస్తారు. ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయం ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకూలంగా లేదని చెప్పాలి.

మిధున రాశి
2025 సంవత్సరం మిధున రాశి జాతకులకు అంతగా బాగోలేదు. మిధున రాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం కారణంగా మిధున రాశి వారు తమకి తాము హాని కలిగించుకుంటారు. మిధున రాశి వారి వృత్తి జీవితం పైన ఈ సమయంలో చెడు ప్రభావం పడుతుంది. ఇమేజ్ దెబ్బ తినే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి 2025 లో ఇబ్బందులు వస్తాయి. నెగటివ్ ఆలోచనలతో కర్కాటక రాశి వారు కష్టాలను ఎదుర్కొంటారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావు. శారీరకంగా మానసికంగా ఆందోళన ఎదుర్కోవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు విశ్రాంతి లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి 2025 సంవత్సరంలోఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆదాయపరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి మీపై నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. రిలేషన్ షిప్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది సింహ రాశి వారికి అత్యంత కష్టమైన కాలం.
మీనరాశి
2025 సంవత్సరంలో మీన రాశి వారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు .ఈ సమయంలో మీన రాశి వారికి శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా వేధిస్తాయి. 2025 సంవత్సరంలో మీన రాశి వారు కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications