ఏప్రిల్ మాసంలో వీరికి తిరుగు లేదు... డబ్బే డబ్బు!
ఏప్రిల్ మాసం.. జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం నుండి ఏప్రిల్ మాసానికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఏప్రిల్ మాసంలో ఐదు ముఖ్యమైన గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. ద్వాదశ రాశుల వారి జీవితాల్లో మార్పులు సంభవించబోతున్నాయి. ఏప్రిల్ మాసంలో సూర్యుడు, శని, శుక్రుడు, కుజుడు , బుధుడు చేసే సంచారం కారణంగా ముఖ్యంగా ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఏప్రిల్ నెల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయి. మీరు సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉంది. మీరు చేసే పని ఉన్నతాధికారుల మన్ననలను పొందుతుంది.ఇది మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే కాలం.

కర్కాటక రాశి
ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ మాసం కర్కాటక రాశి వారికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది . ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వీరికి ఈ మాసం కలిసి వస్తుంది. ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది.
సింహరాశి
ఏప్రిల్ మాసంలో సింహ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. ఈ నెలలో ప్రయాణాలు చేయడానికి మీరు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు . ఉద్యోగం చేసే చోట పదోన్నతులకు అవకాశం ఉంది. గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా మీరు పని చేసే అవకాశం ఉంది.
తులారాశి
ఏప్రిల్ మాసంలో తులా రాశి జాతకులకు కలిసి వస్తుంది. తులారాశి వారు ఈ నెలలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు కూడా సానుకూల ప్రయోజనాలను పొందుతారు. యువత తమ కెరీర్ ను ప్రారంభిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
మకర రాశి
ఏప్రిల్ మాసంలో మకర రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ నెలలో కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం ఉంది. డబ్బు సంపాదనతో పాటు పురోగతికి ఆస్కారం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications