త్వరలో తిరోగమనంలోనూ వీరికి సంపదలు.. తీపికబురు చెప్పిన శని బుధులు!
నిర్దిష్ట కాలం ప్రకారం గ్రహాలు ఒకరాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. కర్మ ప్రదాత అయిన శని జూలై మాసంలో, గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు జూన్ 2025 లో తిరోగమన సంచారం చేయబోతున్నారు. రెండు ముఖ్య గ్రహాలు వ్యతిరేక దిశలో కదులుతూ అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపించబోతున్నారు.
జూన్ 22వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేరోజు బుధుడు తిరోగమన సంచారం మొదలు పెడతాడు.
శని, బుధుల తిరోగమన సంచారం
జూలై 13వ తేదీన శని మీనరాశిలో తిరోగమనం చెందుతాడు ఈ తిరోగమనం నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే తిరోగమన సంచారం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాశులవారికి వివిధ మార్గాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. ఎప్పటినుంచో వసూలు కానీ డబ్బులు వసూలు కావడంతోపాటు కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇక శని, బుధుల తిరోగమన సంచారం కారణంగా లబ్ధి పొందే రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
బుధ మరియు శని తిరోగమన సంచారం వృషభరాశి జాతకులకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృషభరాశిలో మూడవ స్థానంలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు . 11వ స్థానంలో శని గ్రహం తిరోగమనం చెందుతుంది. ఈ కారణాల వల్ల వృషభ రాశి జాతకులు ఏ పని చేసిన విజయం కలిసివస్తుంది. వివిధ ఒప్పందాల నుంచి లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు, జీతాలపెంపు జరుగుతుంది.
మిధున రాశి
బుధ మరియు శని గ్రహాల తిరోగమన సంచారం మిధునరాశి జాతకులకు ప్రయోజనాలను ఇస్తుంది. మిధునరాశిలో కర్మ ఇంట్లో శని తిరోగమనంలో ప్రయాణం చేస్తుండగా, 12వఇంట్లో బుధుడు తిరోగమన సంచారం చేస్తున్నాడు. దీంతో మిధునరాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డబ్బును ఆదా చేస్తారు. కెరీర్లోనూ కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు బుధ మరియు శని గ్రహాల తిరోగమనం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశిలో అదృష్ట గ్రహంలో శని తిరోగమనం చెందుతున్నాడు. ఇక లగ్నం గృహంలో బుధుడి తిరోగమనం కారణంగా కర్కాటక రాశి జాతకులు వివిధ ఒప్పందాల నుండి గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటినుండో పరిష్కారం కాని దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో విజయాలను చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications