జులై 26నుండి గజలక్ష్మీ రాజయోగంతో మీ పంట పండినట్టే!

త్వరలో శ్రావణమాసం రాబోతోంది. జులై 26వ తేదీన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అదే రోజున అత్యంత శుభప్రదమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు బృహస్పతి మిధున రాశిలో కలవడం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.

గజలక్ష్మీ రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి జ్ఞానానికి, శ్రేయస్సుకు, ఆధ్యాత్మికతకు చిహ్నం. ఇక శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతి. ఈ రెండు గ్రహాలు మిధున రాశిలో కలవడం వల్ల ఏర్పడే గజలక్ష్మి రాజయోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

these zoidac signs get sudden wealth with gajalakshmi rajyoga from july 26th

మిధున రాశి
శుక్రుడు మిధున రాశి లోనే సంచరిస్తాడు కాబట్టి గజలక్ష్మి రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ రాజయోగం కీర్తిని తీసుకువస్తుంది. వీరికి పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మిధున రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఆదాయం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తులారాశి
తులా రాశి వారికి 9వ స్థానంలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. తులారాశి జాతకులు పూర్వీకుల నుండి లబ్ధిని పొందుతారు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా తండ్రి తరఫునుంచి ప్రయోజనాలు పొందుతారు. తులా రాశి వారి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. తులారాశి జాతకులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఏడవ స్థానంలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా ధనుస్సు రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వృత్తిపరంగా మంచి విజయాలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి ఐదవ స్థానంలో గజలక్ష్మి రాజ యోగం ఏర్పడుతుంది. కుంభ రాశిలో గజలక్ష్మి రాజయోగం వల్ల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. పిల్లల నుంచి ఈ సమయంలో శుభవార్తలు వింటారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+