నవంబర్ నుండి ఈ రాశులవారు తగ్గేదేలే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారంలో మార్పు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది . జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ధైర్యానికి కారకుడు. అటువంటి కుజుడు నవంబర్ 1వ తేదీన అస్తంగత్వం చెందబోతున్నాడు. కుజుడి అస్తమయం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
కుజుడి అస్తంగత్వం
నవంబర్ ఒకటవ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అస్తమయం చెందిన కుజుడు మే 2 2026 వరకు అస్తంగత్వం లోనే ఉంటాడు. ఎక్కువ కాలం పాటు కుజుడు అస్తమయం చెందడంతో కలిసి వచ్చే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి కుజుడు అస్తంగత్వం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆర్థికంగా లాభాలను చూస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాలలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. అంతకు ముందు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో ఏ సమస్య వచ్చినా ఇట్టే తీరుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడి అస్తంగత్వం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇది వృశ్చిక రాశి వారికి వర్తక వ్యాపారాలలో ను లాభాలను ఇస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు కుజుడి అస్తంగత్వం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో సానుకూల మార్పులు వస్తాయి. ఎంతోకాలంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. కర్కాటక రాశి వారు విదేశీ ప్రయాణాలు చేస్తారు. తెలివిగా చేసే ఇన్వెస్ట్మెంట్ ల వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications