శనిదేవుడి పవర్ ఇదే.. పేదను కూడా రాజును చేయగలడు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని రెండు రాశి చక్రాలకు అధిపతిగా పరిగణిస్తారు. మకర రాశి, కుంభ రాశికి శని గ్రహమే అధిపతి అని చెబుతారు. శని చాలా నిదానంగా కదిలే గ్రహం. నవగ్రహాలలో చాలా నిదానంగా కదిలే గ్రహంగా శనిని చెబుతారు.
శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉండి వేరే రాశిలోకి వెళుతుంది. అలా శని మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశులను పూర్తి చేయడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. శని తీవ్రమైన గ్రహంగా పరిగణించబడుతుంది. దీనిని నపుంసక గ్రహంగా చెబుతారు. శని గ్రహాన్ని సూచించడానికి నలుపును, నీలం రంగును సూచిస్తారు.

శని తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందే గ్రహం. శని అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధ, శుక్ర గ్రహాలతో శని మితృత్వాన్ని, రవి చంద్ర కుజ గ్రహాలతో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. గురువుతో సమంగా శని ఉంటాడు. శనిగ్రహం అనేది కర్మ గ్రహం. ఒక వ్యక్తి యొక్క చర్యలు శుభమా, అశుభమా అనేది శని దేవుడు నిర్ణయిస్తాడు.
శని జీవితంలో అనేక గుణపాఠాలను నేర్పుతాడు. మనిషికి కావలసిన సహనాన్ని, క్రమశిక్షణను శని నేర్పుతాడు. వాస్తవికతకు, శ్రమకు, సంకల్పానికి శని ప్రతీకగా ఉంటాడు. శని ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాడు. జీవితంలో మనకు ఇష్టం లేని వాటిని బోధిస్తాడు. కాబట్టి చాలామంది శనిని క్రూర గ్రహంగా పరిగణిస్తారు. శని మాత్రం మనిషి జీవితానికి ఉన్న సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. శని వైరాగ్యాన్ని, భక్తిని కూడా ప్రసాదిస్తాడు.
దానధర్మాలు చేసే వారంటే శనికి చాలా ఇష్టం. శని రాజునైన బంటును చేయగలడు. పేదవాడిని కూడా మహారాజు లాగా మార్చగలడు. ఎవరైతే శని దీవెనలు పొందుతారో, ఆయన కటాక్షాన్ని పొందుతారో వారు కచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు. ఎన్నో గొప్ప గుణాలను మనకు నేర్పే శని దేవుడు నిజంగానే చాలా పవర్ఫుల్.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications