ఈ నెల 28 నుంచి ఈ రాశుల జీవితం బ్రహ్మాండం
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శని దేవుడు 138 రోజుల తర్వాత ఈనెల 28వ తేదీన మీన రాశిలో వక్ర మార్గం నుంచి సక్రమ మార్గంలోకి అడుగుపెడుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోనాలను కలగనున్నాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే అంతకు రెట్టింపు చెడు ఫలితాలను శని ఇస్తాడు. ఆయన తలుచుకుంటే పేదవాడిని కూడా కోటీశ్వరుడిగా చేస్తాడుకానీ ధర్మబద్ధంగా జీవించాలి. ఇప్పుడు శని వల్ల మంచి ఫలితాలను అందుకునే రాశుల వివరాలను తెలుసుకుందాం.
కన్యారాశి
కెరీర్ పరంగా ఈ రాశివారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. సమయం కూడా బ్రహ్మాండంగా కలిసివస్తుంది. ప్రయాణాలు చేస్తారు. కార్యాలయాల్లో ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రయాణాలు చేసేవారికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారు పౌష్టికాహారం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

వృషభరాశి
పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. అలాగే కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. దీర్ఘకాలికంగా అవకుండా ఉన్న పనులు కూడా పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మారతాయి. మీరు బలపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు కూడా ఈ సమయంలోనే తొలగిపోతాయి.
సింహరాశి
అదృష్టం వీరిని వరిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సంపాదన గతంలో కంటే ఇప్పుడు బాగా పెరుగుతుంది. భారీ మొత్తంలో సంపద కలుగుతుంది. పెళ్లికానివారికి ఫిబ్రవరిలోకా సంబంధాలు కుదురుతాయి. వివాహ బంధంలో ఉన్నవారు అన్యోన్యంగా కలిసివుంటారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి.












Click it and Unblock the Notifications