102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమి... ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈరోజు పుష్య మాసం పౌర్ణమి వచ్చింది. అలాగే ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో అత్యంత ప్రభావంతమైన మొదటి షాహి స్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దాదాపు 102 సంవత్సరాల తర్వాత గొప్ప కలయిక జరుగుతోంది. అది ఏమిటంటే.. శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రతోపాటు పౌర్ణమి ఒకే రోజు వచ్చాయి. అలాగే ఈరోజు భోగి పండగ. ఇవన్నీ అపూర్వమైన కలయిక అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఈరోజు స్నానాలు, జపాలు, హోమాలు చేసుకునేవారికి జీవితంలో తిరుగులేదు. 102 సంవత్సరాల తర్వాత అద్భుతంగా కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
పుష్య పౌర్ణమికి ఏర్పడే యోగంవల్ల న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే కొత్త వాహన యోగం ఉంది. ఇప్పటివరకు రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలోనే చేతికి అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎటువంటి పరిస్థితుల్లో మాట ఇవ్వకూడదు. మాట ఇస్తే కచ్చితంగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు ఈరోజు శివాలయాన్ని సందర్శిస్తే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

కన్యా రాశి
సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారికి ఆస్తి లాభం ఉంది. విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు తలుపు తడతాయి. గతంలో మీరు సాయంచేసినవారు తిరిగి మీవద్దకే వస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వేతనం కూడా పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. కొన్నిరకాల వ్యాధులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉందికానీ అవన్నీ చిన్నచిన్నవే అవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి.
సింహరాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోయి ఎవరి ఆస్తి వారికి వస్తుంది. అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. సమాజంలో మంచి మార్పులకు మీరు కారణమవుతారు. గురువును పూజించాలి. శివాలయాన్ని దర్శించి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. గురువు చెప్పిన మాటను జవదాటకూడదు. అప్పుడే జీవితంలో వృద్ధికి బాటలు తెరుచుకుంటాయి.












Click it and Unblock the Notifications