నవరాత్రుల్లో ఈ రాశులవారికి ధనపు రాశులతో ప్రత్యక్షం కాబోతున్న లక్ష్మీదేవి!
ఈ నెల 22వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబరు రెండోతేదీతో ముగిసే ఈ వేడుకల్లో ఈనెల 24వ తేదీన మనసుకు కారకుడయ్యే చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి అంగారకుడు అదే రాశిలో సంచారం చేస్తుంటాడు. దీంతో చంద్రుడు, అంగారకుడి కలయిక జరుగుతుంది. దీనివల్ల ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అన్ని పనులు సజావుగా జరుగుతాయి.
మకర రాశి
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం చాలా సులువుగా దక్కుతుంది. ఉద్యోగస్థులకు మంచి ప్రయోజనాలున్నాయి. అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు అవుతాయి. శనిదేవుడు శుభస్థానంలో ఉండటంవల్ల కూడా కలిసివస్తోంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడంవల్ల భవిష్యత్తులో మంచి రాబడి పొందడానికి ఇది మంచి సమయం, అనువైన సమయం. గతం నుంచి మీరు చేయాలనుకుంటున్న పనులు ఇప్పుడు ప్రారంభించడం చాలా మంచిది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.

కుంభరాశి
అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల బాగా కలిసివస్తుంది. కష్టమైన, కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. అద్భుతాలు సృష్టించగలిగే నైపుణ్యం మీ దగ్గర ఉంది. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నవారు ఈ సమయలో చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తులారాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆర్థికంగా మంచి రాబడి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వీరికి ప్రయోజనాలు గరిష్టంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సంబంధాలు బలపడతాయి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు.












Click it and Unblock the Notifications