రేపటి నుంచి ఈ రాశులకు గోల్డెన్ టైం ప్రారంభం

గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ఆయన ఈనెల 6వ తేదీన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. మరో ప్రధాన గ్రహం, నీడ గ్రహంగా పేరు తెచ్చుకున్న కేతువు కూడా నక్షత్రాన్ని అదేరోజు మార్చుకుంటున్నారు. ఈ రెండు గ్రహాలు పునరస్వు నక్షత్రంలోకి ఆరోతేదీన ప్రవేశిస్తాయి. దీనివల్ల కొన్ని రాశులవారి అదృష్టం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు గ్రహాల నక్షత్ర సంచారం ఏయే రాశులకు ఏ విధంగా మేలు చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

సింహ రాశి
ఉద్యోగస్థులకు వారి వేతనంతోపాటు అదనపు ఆదాయానికి ఇతర మార్గాలు దొరుకుతాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వస్తువులకు సంబంధించిన సంపద పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే శుభవార్తను అందుకుంటారు. ఉద్యోగస్థులకు చాలా బాగుంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని, కేతువును పూజించాలి.

three zodiac signs will get amazing benefits due to sun and ketu will enter punarvasu nakshatram

కుంభ రాశి
కొత్తగా ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు కొత్త అవకాశాలు అందుకుంటారు. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు, అదనపు బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారస్తులకు మంచి పురోభివృద్ధి ఉంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మికతపట్ల మొగ్గుచూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. శివాలయాల్లో, ఆంజనేయస్వామి ఆలయాల్లో నవగ్రహాలకు పూజ చేయడంతోపాటు సూర్యుడిని, కేతువును పూజిస్తే అనుకున్నదానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.

మేష రాశి
ఈ రాశివారు కొత్తగా ఇంటినికానీ, భూమిని కానీ కొనుగోలు చేస్తారు. దాంతోపాటు వాహనాన్ని కూడా కొంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్థులకు వారి వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. గతంలో ఉన్న పాత మార్గాలద్వారా ఈ సమయంలో డబ్బులు చేతికి అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+