Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

today horoscope: నేడు వీరికి అనవసర ధనవ్యయం.. గొడవలకు దూరంగా ఉండాలి!!

నేడు గ్రహాల గమనం వివిధ రాశుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే నేడు మేష రాశి నుండి కన్యా రాశి వరకు రాశుల వారి జాతకం ఎలా ఉంది? తీసుకోవలసిన జాగ్రత్తలను వారు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి వారు తమ ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చాలా చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విషయాలతో కాలం వృధా చేయకుండా పనిచేయాలి. మేష రాశి వారికి ఈ రోజు సాహసోపేతమైన విజయాలు వచ్చే అవకాశం ఉంది. వీరికి శివారాధన శుభప్రదంగా చెప్పబడింది.

today horoscope Aries to Virgo Lucky for them un lucky for these zodiac signs

వృషభ రాశి వారు విందులు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలను చేస్తారు. అయితే ఈరోజు మనసు చెడ్డ కార్యక్రమాల మీదకు మళ్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనవసరపు ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమంతుని ఆరాధించడం మంచిది.

మిధున రాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలని సూచించబడింది. శారీరిక శ్రమ ఈరోజు అధికంగా ఉంటుంది .ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని అందిస్తాయి. వీరు శని శ్లోకాన్ని చదవడం మంచిది.

కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను రాబడతారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. ఈ రోజు వీరికి ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి. శ్రీ ఆంజనేయుడిని ఈ సమయంలో పూజిస్తే మంచిది.

సింహ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు. బుద్ధిబలంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. అనవసరంగా ఆందోళన పడే అవకాశం ఉంది. దైవారాధన అసలే మానుకోవద్దు.

కన్య రాశి వారు ఈ సమయంలో చక్కటి ఆలోచనలతో ముందుకు సాగాలి. నేడు కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. అయినా ఆందోళన పడకూడదు. గణపతి ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+