today horoscope: నేడు ఈరాశులవారు శుభవార్తలు వింటారు!!

నేడు గ్రహాల గమనం కారణంగా అన్ని రాశి జాతకులు వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే నేడు ఏ రాశి వారికి మంచి జరుగుతుంది? ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి? తులారాశి నుండి మీన రాశి వరకు ఆరు రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం.

తులా రాశి వారికి నేడు అంతా అనుకూల ఫలితాలు లేవు. తులారాశి జాతకులు కుటుంబ సభ్యుల మాటలకు గౌరవ ఇవ్వడం నేడు ఎంతో మంచిది. కోపానికి పోకుండా ఉండాలి. ఇక ఒక కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. మీరు శివ అష్టోత్తరాన్ని చదివితే మంచిది.

today horoscope Good news for these zodiac signs

వృశ్చిక రాశి వారికి ఈరోజు కాస్త సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు నేడు ధైర్యంతో ముందుకు అడుగు వేసి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలని సలహా ఇవ్వబడింది. వృశ్చిక రాశి వారు నేడు బద్ధకంగా ఉండకూడదని సూచన. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే వీరికి శుభప్రదంగా ఉంటుంది.

ధనుస్సు రాశి వారికి నేడు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆర్థికంగా పురోగమిస్తారు. ధనుస్సు రాశి వారు ఒక శుభవార్తను వింటారు. దగ్గర వారిని దూరం చేసుకోవడం మంచిది కాదు. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకర రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. మీరు సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శన వీరికి శుభప్రదంగా ఉంటుంది.

కుంభరాశి వారికి నేడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన విషయాల్లో కుంభ రాశి వారు ఆచి తూచి వ్యవహరించాలి. నేడు కుంభరాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

మీన రాశి వారికి నేడు అంతా శుభప్రదంగా ఉంటుంది. మీ మీ రంగాలలో చక్కటి శుభ ఫలితాలను ఈ రోజు అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నేడు విష్ణువుని ఆరాధిస్తే చాలా మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+