Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు హనుమాన్ జయంతి.. హనుమంతుడికి ఇష్టమైన ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారమే!!

నేడు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి పర్వదినం హిందువులందరికీ శుభదినంగా భావిస్తారు. అయితే హనుమాన్ జయంతి పర్వదినం నాడు హనుమంతుడికి ఇష్టమైన కొన్ని రాశుల గురించి, హనుమంతుడి కటాక్షం పుష్కలంగా లభించే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. హనుమాన్ దయ కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది.

మేష రాశి
హనుమంతునికి ఇష్టమైన రాశులలో ముఖ్యమైనది మేషరాశి. మేషరాశి జాతకులు హనుమంతుడి దయ కారణంగా మంచి ఫలితాలను చూస్తారు. వీరికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో కష్టాలు వచ్చినా అవి త్వరగానే తీరుతాయి. మేషరాశి జాతకులు మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.

Today is Hanuman Jayanti These Hanuman favorite zodiac signs always lucky and wealthy

సింహరాశి
హనుమంతుడికి ఇష్టమైన రాశులలో మరొకటి సింహరాశి. సింహరాశి జాతకులకు హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. సింహరాశి జాతకులు ఏ పని చేపట్టిన ఆ పని సక్సెస్ కావడానికి హనుమంతుడు కూడా ఒక కారణం. సింహరాశి జాతకులకు ధనం కొదువ లేకుండా హనుమంతుడు చూస్తాడు. మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహ రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
హనుమాన్ జీ కి ఇష్టమైన మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పైన కూడా హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి. జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. నిస్వార్ధంగా ఉండే వారికి హనుమంతుడి దయ తప్పక ఉంటుంది.

కుంభరాశి
హనుమాన్ కి ఇష్టమైన మరొక రాశి శని సొంత రాశి అయిన కుంభరాశి. కుంభ రాశి జాతకులకు కూడా హనుమంతుడి దయ పుష్కలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమాన్ జి మీకు ఇస్తాడు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మంగళవారం రోజు ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+