మహాలయ అమావాస్య నేడు.. ఈ పనులు పొరబాటున చేసినా అంతే సంగతి!
నేడు మహాలయ అమావాస్య . మహాలయ అమావాస్యను పితృ అమావాస్య సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు .పితృపక్షాల యొక్క చివరి రోజును సర్వపితృ అమావాస్యగా చెబుతారు. ఈరోజును మన పూర్వీకుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారిని ఆశీర్వదించి వెళతారని చెబుతారు.
మహాలయ అమావాస్య ... పొరబాటున కూడా ఈ పనులు చెయ్యొద్దు
అందుకే సర్వపితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తుచేసుకొని వారికి శార్ధ, దాన, తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈరోజు అక్టోబర్ రెండవ తేదీన సర్వపితృ అమావాస్య సందర్భంగా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆత్మకు శాంతిని చేకూర్చడానికి వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వారికి పిండ ప్రదానం చేయాలి. సర్వపితృ అమావాస్యగా చెప్పబడే ఈరోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు.

మహాలయ అమావాస్య నాడు ఇలా చేస్తే తప్పు
పితృదేవతలకు ఆగ్రహానికి తెప్పించే కొన్ని పనులు చేస్తే పితృదేవతలు ఆశీర్వాదాలు ఇవ్వడానికి బదులుగా ఆగ్రహంతో శాపాన్ని ఇస్తారని చెబుతారు. అసలు సర్వపితృ అమావాస్య రోజు పూర్తిగా నిషేధించబడిన చేయకూడని కొన్ని పనులను గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. మహాలయ అమావాస్యగా చెప్పబడే సర్వపితృ అమావాస్య రోజు ఎవరైనా సరే ఇంటికి వస్తే వారిని వట్టి చేతులతో పంపించకూడదు.
ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం
ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని ఏమీ ఇవ్వకుండా లేదని తిప్పి పంపించడం ఈరోజు దోషంగా పరిగణించబడుతుంది. ఇలా ఎవరైనా చేస్తే పితృదేవతలు ఆగ్రహిస్తారు. సర్వపితృ అమావాస్యనాడు ఇంటికి వచ్చిన పేదలకు, బ్రాహ్మణులకు, నిస్సహాయులకు, స్త్రీలకు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషపడతారు. పూర్వీకుల ఆశీర్వాదం కచ్చితంగా ఉంటుంది.
ఎవరినీ అవమానించకూడదు
పితృపక్షం చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య రోజు పొరపాటున కూడా ఎవరిని అవమానించకూడదు. ఎవరిని ఉద్దేశించి చెడుగాను మాట్లాడకూడదు. ఎవరినైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. పితృదేవతలకు ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. ఇక చాలామంది మహాలయ అమావాస్య రోజు మాంసాహారం తింటారు. మద్యాన్ని సేవిస్తారు. మద్య, మాంసాలు మహాలయ అమావాస్య రోజు తినకూడదు.
మాంసాహారం, మద్యపానం చెయ్యరాదు
పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేవారు మాంసాహారం తింటే పితృదేవతలకు కోపం వస్తుంది. మహాలయ అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, గుడ్లు, చేపలు పొరపాటున కూడా తినకూడదని, మద్యపానం చేయకూడదని చెబుతారు. ఒకవేళ ఎవరైనా వీటిని తీసుకుంటే పితృదేవతలకు మన పైన ఆగ్రహం వస్తుంది. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదాలు పొందడానికి నియమ నిష్ఠలతో శార్ధ కర్మలు చేయాలి. దానధర్మాలు చేయాలి.












Click it and Unblock the Notifications