మహాలయ అమావాస్య నేడు.. ఈ పనులు పొరబాటున కూడా చెయ్యొద్దు!!
ఈరోజే మహాలయ అమావాస్య, పితృ అమావాస్య, సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజును పెద్దల కోసమే కేటాయిస్తారు. పితృ పక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని తమ వారిని ఆశీర్వదించి వెళతారని చెబుతారు. పితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తుచేసుకొని శార్ద , దాన, తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు.
ఈరోజు అక్టోబర్ 14వ తేదీన పితృ అమావాస్య సందర్భంగా అందరూ పితృదేవతల ఆత్మ శాంతికి, వారిని గుర్తు చేసుకుని పిండ ప్రదానం చేస్తున్నారు. అయితే సర్వ పితృ అమావాస్యగా చెప్పబడే ఈ రోజున కొన్ని పనులు చేస్తే పితృ దేవతలకు ఆగ్రహం వస్తుందని, ఫలితంగా ఆశీస్సులకు బదులు శాపాలు వస్తాయని చెబుతున్నారు. సర్వ పితృ అమావాస్య రోజు నిషేధించబడిన, చేయకూడని కొన్ని పనులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సర్వ పితృ అమావాస్యనాడు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని వట్టి చేతులతో పంపించ కూడదు. ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని లేదని తిప్పి పంపించడం దోషంగా పరిగణించబడుతుంది. సర్వ పితృ అమావాస్యనాడు ఇంటికి వచ్చిన పేదవారికి, బ్రాహ్మణులకు, నిస్సహాయులకు, స్త్రీలకు మీకు ఉన్నదానిలో కొంత దానం చేయడం మంచిదని చెప్పబడింది.
ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా, ఎలాంటి దానం చేయకుండా పంపించ కూడదనే విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. పితృ పక్షం చివరి రోజైన సర్వ పితృ అమావాస్య నాడు ఎవరిని అవమానించ కూడదు. ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరినైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించ కూడదని సూచించబడింది.
చాలామంది మహాలయ అమావాస్య రోజున మాంసం, చేపలు వండుకొని తింటూ ఉంటారు. అయితే మహాలయ అమావాస్య రోజున ఈ పని చేయకూడదని చెబుతున్నారు. మహాలయ అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, చేపలు, గుడ్లు తినకూడదని, మద్యపానం చేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ వీటిని తీసుకుంటే పూర్వీకులకు చిరాకు కలిగి మనపై ఆగ్రహిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications