ప్రబోధిని ఏకాదశి నేడే.. రాజయోగాలతో ఈ రాశులవారికి విష్ణుకటాక్షం!
సనాతన ధర్మంలో కార్తీకమాసానికి, శ్రీ మహావిష్ణువు పూజకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది. కార్తీక మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మాసంగా చెప్తారు. నారద పురాణంలో కార్తీక శుక్ల పక్ష ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అత్యంత ప్రధానమైంది. కార్తీక శుక్ల పక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ప్రబోధిని ఏకాదశి, దేవ్ ఉథాని ఏకాదశి, దేవుత్తని ఏకాదశి అని కూడా అంటారు.
ప్రబోధిని ఏకాదశి నేడే
కార్తీక మాసంలోని శుక్లపక్షం లోని 11వ రోజున ఇది వస్తుంది.విష్ణు నిద్రించు నాలుగు నెలల చాతుర్మాస కాలం ఈరోజుతో ముగుస్తుంది. ఈ రోజున తులసికి వివాహ వేడుకను నిర్వహిస్తారు. ప్రబోధిని ఏకాదశి నవంబర్ 1న అంటే నేడు వస్తుంది .ఇక ఇదే రోజున రెండు ముఖ్యమైన శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవి వివిధ రాశుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తున్నాయి.

నేడు ఇలా చేస్తే విష్ణు కటాక్షం
ప్రబోధిని ఏకాదశి నాడు విష్ణు భగవానుడికి ద్రాక్ష, దానిమ్మ, అరటి పండ్లు మొదలైన నైవేద్యంగా సమర్పించి, మంత్రాలతో, విష్ణు నామస్మరణతో నిష్టగా భగవంతుని పూజిస్తే అందరూ సంతోషంగా జీవిస్తారు. సుఖశాంతులతో బ్రతుకుతారు. ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి అత్యంత నిష్టతో విష్ణుమూర్తి ని పూజిస్తే విష్ణు సాయుజ్యం లభిస్తుందని చెప్తారు.
ఈ ఏడాది ప్రబోధిని ఏకాదశి ప్రాముఖ్యత
ఈ ఏకాదశి అతి పెద్ద ఏకాదశిగా భావిస్తారు. విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మికి వివాహం జరిగింది ఈ రోజేనని చెబుతారు.ప్రబోధిని ఏకాదశి రోజున ఊహించని అందమైన యాదృచ్ఛిక సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ఇదే రోజున యోగాలు ఏర్పడనున్నాయి.దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం సిద్ధిస్తుంది. శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే ఈరోజు ఈ రెండు యోగాలు సంభవించనున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రబోధిని ఏకాదశికి ప్రాధాన్యత వచ్చింది.
నేడు రెండు ముఖ్యమైన యోగాలతో వీరికి లక్
నేడు రవి యోగం, మహాపురుష రాజయోగం ఏర్పడబోతున్నాయి. వీటి కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి, కన్యా రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, మేషరాశి జాతకులు ప్రబోధిని ఏకాదశినాడు ఏర్పడే శుభ యోగాల కారణంగా లబ్ధిని పొందుతారు. ఊహించని లాభాలను చూస్తారు.
ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం
కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టడానికి ఇది వీరికి మంచి సమయంగా ఉంటుంది. సంపదలు కలగడంతో పాటు, వీరి జీవితం ఆనందంగా మారుతుంది. వీరికి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశీయానం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications