వరూధిని ఏకాదశి నేడే... విశేష యోగాలతో ఈ రాశులవారికి పండుగే!
జ్యోతిష్య శాస్త్రంలో తిధులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు వరూధిని ఏకాదశి. ఏప్రిల్ 24వ తేదీన గురువారం నాడు వచ్చిన వరూధిని ఏకాదశి చాలా ప్రత్యేకమైన ఏకాదశిగా చెప్పవచ్చు. ఇదే రోజు శతభిషా, పూర్వాభాద్ర నక్షత్రాల కలయిక కూడా ఏర్పడుతున్న కారణంగా ఈ వరూధిని ఏకాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే నేడు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందుతున్నారు.
వరూధినీ ఏకాదశి నాడు విశేష యోగాలు
వీరిపైన విష్ణుమూర్తి యొక్క ప్రత్యేకమైన కటాక్షం ఉండబోతుంది. వరూధిని ఏకాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల అలాగే ఈరోజు ఏర్పడే కొన్ని విశేష యోగాల వల్ల మంచి ఫలితాలను పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వరూధిని ఏకాదశినాడు ఏర్పడే శుభ యోగాల కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మానసిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
కర్కాటక రాశి
వరూధిని ఏకాదశి నాడు ఏర్పడుతున్న శుభ యోగాల కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకుల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు అనేక ఇబ్బందుల నుండి బయటపడతారు.
ధనుస్సు రాశి
వరూధిని ఏకాదశి నాడు ఏర్పడుతున్న శుభ యోగాల కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక రంగాల పైన కూడా ఆసక్తి కలుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు.
మీన రాశి
వరూధిని ఏకాదశినాడు ఏర్పడుతున్న శుభ యోగాలు మీన రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారు ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మానసికంగా బలంగా ఉంటారు. సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications