today rashi phalalu: ఆ గ్రహాల ఆశీర్వాదంతో పులిపంజా చీల్చి సంపన్నులయ్యేది వీరే!
జనవరి 12, 2026 సోమవారం నాడు గ్రహాల గోచారం ఆధారంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు వస్తాయి. జనవరి 12న సూర్యుడు మకర రాశిలో , కుజుడు బలమైన స్థితిలో, కార్యసాధనకు అనుకూలంగా ఉంటాడు. బుధుడు బుద్ధికి బలం చేకూరుస్తాడు.
ముఖ్య గ్రహాల సంచారంతో వీరికి లబ్ది
శుక్రుడు సుఖ, సంతోషాలతో, గురువు శుభ దృష్టితో సంచారం చేస్తున్నారు. శని సంచారం క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. రాహు కేతువుల సంచారంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. దీంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తున్నాయి. మరి ద్వాదశ రాశుల వారికి నేడు ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం.

మేష రాశి
నేడు మేషరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది.
వృషభ రాశి
సూర్య శని ప్రభావంతో ఖర్చులు పెరిగినా అవి అవసరం అయినవిగానే ఉంటాయి. నేడు వృషభ రాశి వారికి మాటల్లో సంయమనం అవసరం.
మిథున రాశి
నేడు మిధున రాశి వారికి బుధుడి అనుగ్రహంతో కమ్యూనికేషన్ మెరుగవుతుంది. వ్యాపార లాభాలు, ప్రయాణ యోగం ఉన్నాయి.
కర్కాటక రాశి
నేడు కర్కాటక రాశి వారికి చంద్ర ప్రభావంతో భావోద్వేగాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం.
సింహ రాశి
సింహరాశి జాతకులకు నేడు సూర్యుడి బలం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా గౌరవ సూచనలు ఉన్నాయి.
కన్య రాశి
కన్యా రాశి జాతకులు బుధుడి ప్రభావంతో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
తుల రాశి
తులా రాశి వారికి శుక్ర ప్రభావంతో దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్యాల్లో లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కుజుడు అనుకూలంగా ఉండటంతో శత్రువులపై పైచేయి సాధిస్తారు. ధైర్యవంతమైన నిర్ణయాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి జాతకులకు గురు దృష్టితో కెరీర్‌లో ముందడుగు పడుతుంది. శుభవార్త వినే అవకాశం ఉంది.
మకర రాశి
నేడు మకర రాశి వారికి సూర్య సంచారం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి, ఇంటి విషయాల్లో శ్రద్ధ అవసరం.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులు నేడు శని ప్రభావంతో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
మీన రాశి
నేడు మీనరాశి జాతకులకు గురు అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications