నేడు ఈ రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.. మీ రాశి ఉందా?
ఆగస్టు 25, 2026 శ్రావణ మంగళవారం. ఈ రోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం 12 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అంశాల్లో వివిధ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృశ్చిక, మకర రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి.
మేష రాశి: నేడు మేషరాశి జాతకులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో అంచనాలు నిజమవుతాయి. అనవసర ఖర్చులు, రుణాలు నివారించాలి. కుటుంబ సంబంధాలు బలపడతాయి.
వృషభ రాశి: వృషభ రాశి జాతకులకు కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఓపికతో ముందుకు సాగాలి. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది.

మిథున రాశి: నేడు మిథునరాశి జాతకులకు కొంత కష్టమైన రోజు. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పథకాల నుంచి లాభం రావచ్చు. జాగ్రత్తగా పనులు చేయాలి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి జాతకులకు నేడు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం మెరుగుపడుతుంది. కుటుంబ, స్నేహితుల మద్దతు ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
సింహ రాశి: సింహరాశి జాతకులకు నేడు సవాలు నిండిన రోజు. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం . ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కన్యా రాశి: కన్యా రాశి జాతకులు నేది బాగా కష్టపడి పని చేయాలి. అదృష్టం మీద ఆధారపడకూడదు. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ ప్రస్తుత ఉద్యోగం మంచిది.
తులా రాశి: నేడు తులారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మానసిక గందరగోళం అడ్డంకులు కలిగించవచ్చు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
వృశ్చిక రాశి: నేడు వృశ్చిక రాశి జాతకులకు లాభదాయకమైన రోజు. వ్యాపారాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబ వివాదాలు తీరుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: నేడు ధనుస్సు రాశి వారికి పని భారం పెరగవచ్చు. ఏ విషయాలలోనూ అనవసర జోక్యం చేసుకోకూడదు. చట్టపరమైన విషయాల్లో సలహా తీసుకోవాలి.
మకర రాశి: మకర రాశి జాతకులకు నేడు ఆంజనేయుని అనుగ్రహం ఉంటుంది. సమస్యలు చర్చ ద్వారా పరిష్కారం అవుతాయి. కొన్ని ప్రణాళికలు విజయవంతం కావచ్చు. ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
కుంభ రాశి: కుంభ రాశి వారు ఈ రోజు పనిలో ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ పురోగతి మార్గంలోని ఆటంకాలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో మీకు ప్రేమ, సహకారం లభిస్తాయి.
మీన రాశి: సాధారణంగా సమతుల్య ఫలితాలు వస్తాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు రావచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలమైనది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications