వినాయక చవితి నాడు విశేషయోగాలు.. ఈ రాశులవారికి తిరుగే లేదు!
నేడు సెప్టెంబర్ 14, సోమవారం వినాయకచవితి పర్వదినం. ఈ రోజు భాద్రపద శుక్ల చతుర్థి తిథి,చిత్తా నక్షత్రం తర్వాత స్వాతి నక్షత్రం, చంద్రుడు తులా రాశిలో సంచరించనున్నాడు. బ్రహ్మ యోగం, బుధాదిత్య యోగంతో పాటు కొన్ని రాశులకు మాలవ్య, భద్ర యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. దీనివల్ల వృషభం, కన్య, తులా, ధనుస్సు రాశులవారికి ప్రత్యేక శుభఫలితాలు ఉన్నాయి. వినాయకచవితి పండుగ నాడు ద్వాదశ రాశులవారి జాతకఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం: మేషరాశి జాతకులకు కుటుంబంలో సహకారం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా మెరుగైన సూచనలు ఉన్నాయి.

వృషభం: వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో లాభాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి రాబడి రావచ్చు.
మిథునం: మిథున రాశి జాతకులకు కెరీర్‌లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది.
కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
సింహం: సింహరాశి జాతకులలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. వీరికి నేడు వినాయకుడి దయతో కొత్త అవకాశాలు రావచ్చు.
కన్య: నేడు కన్యా రాశి జాతకులకు గణేశుడి దయ కారణంగా పనిభారం పెరిగినా ఫలితాలు మంచిగా ఉంటాయి. ఆర్థిక లాభాలు వస్తాయి.
తులా: తులారాశి వారికి గణేశుడి కృపతో ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త బాధ్యతలు వస్తాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు సంబంధాల్లో స్పష్టతనేడు కనిపిస్తుంది, పనిలో స్థిరత్వం ఉంటుంది.
ధనుస్సు: గణేశుడి ఆశీస్సులతో ధనుస్సు రాశి జాతకులకు లాభాలు వస్తాయి. కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది.
మకరం: మకర రాశి జాతకులకు ఓపికతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నేడు వినాయకుడి దయ వీరిపై పుష్కలంగా ఉంటుంది.
కుంభం: నేడు కుంభ రాశి జాతకులకు వినాయకుడి దయతో కలిసి వస్తుంది సామాజిక పరిచయాలు పెరుగుతాయి.
మీనం: మీనరాశి వారికి ఆధ్యాత్మికత పెంపొందుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది.వినాయక చవితి నాడు గణేశుడిని భక్తితో పూజించి, సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించండి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
