ముఖ్య గ్రహాల అరుదైన కలయికతో ఈ రాశులవారి పంట పండుతుంది!
నేడు జులై 17 శుక్రవారం.. నేడు జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారికి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటంతో దీనిని కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు. గురుగ్రహం కర్కాటక రాశిలో, శని దేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు.అంతేకాదు ఆకాశంలో బుధ, గురు, శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక కనిపించే అవకాశం ఉంది. దీని ఫలితంగా ద్వాదశ రాశులవారి జాతకాలు ఒకసారి చూద్దాం.
మేష రాశి
మేష రాశి జాతకులకు నేడు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. అయితే నేడు మేష రాశి వాళ్లు ఆలోచించే తీసుకునే నిర్ణయాలు లాభాలను సేకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ లో పని చేసే వారికి కొత్త బాధ్యతలు వస్తాయి.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి బాగుంటుంది. పనిచేసే చోట కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సామరస్యంగా వ్యవహరించడం మంచిది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు నేడు కొత్త ప్రాజెక్టులు కలిసి వస్తాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఉండే అవకాశం ఉంది. ఒకేసారి చాలా పనులు మీద శ్రద్ధ పెట్టకుండా, ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు సూర్యుడి కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. వీరికి సమయంలో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కోప తాపాలను అదుపులో ఉంచుకోవటం వలన మంచి జరుగుతుంది.
సింహరాశి
సింహరాశి వారికి శుభయోగాల ప్రభావంతో మీ ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినా ఖర్చుల విషయంలో జాగ్రత్త.
కన్యారాశి
కన్యా రాశి జాతకులు ఈ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారు ముఖ్యమైన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
తులారాశి
తులారాశి వారికి నేడు కలిసొస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఈరోజు దైవారాధన చేయడం వలన తులా రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు ఉద్యోగ ప్రగతి కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి వేగాన్ని పుంజుకుంటాయి. అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం ఉత్తమం. పనిచేసే చోట ఉద్యోగులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
మకర రాశి
మకర రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా బలపడేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు రోజంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మనో ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సాగుతాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
మీన రాశి
మీనరాశి జాతకులు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శని దేవుని ఆరాధన చేయడం వల్ల పనులలో ఆటంకాలు తొలగిపోతాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications