today rashiphalalu: నేడు వీరు తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోవద్దు!
జులై 22 2026 బుధవారం సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో, కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు మిథున రాశిలో, గురుడు కర్కాటక రాశిలో, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల స్థితి ద్వాదశ రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు ద్వాదశ రాశులవారి జాతక ఫలాలు ఒకసారి చూద్దాం.
మేషరాశి
మేషరాశి జాతకులకు నేడు గ్రహ బలం ఉంటుంది. పనులలో సకాలంలో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. తగిన విశ్రాంతి అవసరం.

వృషభ రాశి
ద్విద్వాదశ దృష్టి యోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిపుష్టి లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిధున రాశి
మిధునరాశి వారికి నేడు కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నూతన ఆలోచనలు అమలు చేసి వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. తోబుట్టువుల నుండి సహకారం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పని ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కారణంగా ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది .
సింహ రాశి
సింహరాశి జాతకులకు ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. వ్యాపార భాగస్వామ్యాలు, ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులు పనుల రీత్యా బిజీగా ఉంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. ఆస్తి సంబంధిత విషయాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. స్నేహితులు, బంధువుల మద్దతు లభిస్తుంది.
తులా రాశి
చంద్రుడు జన్మరాశిలో ఉన్న కారణంగా తులారాశి వారు అప్రమత్తంగా ఉండాలి. శారీరక శ్రమ వల్ల అలసట పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేడు కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంత పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.వాహనాలు నడిపెటప్పుడు జాగ్రత్త. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి .
మకర రాశి
మకర రాశి వారికి నేడు వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. భాగస్వామ్య ఒప్పందాల వల్ల అనుకూల లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి ధార్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు లేదా రుణాలు తగ్గించుకునే మార్గం ఉంటుంది. చిన్నపాటి శారీరక రుగ్మతలు ఇబ్బంది పెడతాయి.
మీనరాశి
మీనరాశి జాతకులకు నేడు అనుకూల వాతావరణం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు పెరిగి కొత్త పనులు మొదలు పెడతారు. విద్యార్థులకు నేడు మంచి జరుగుతుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications