today rashiphalalu: ఫిబ్రవరి తొలిరోజే శుక్రుడి దయతో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
జనవరి మాసం ముగిసింది. ఫిబ్రవరి మాసం మొదలైంది. ఫిబ్రవరి 1, 2026 గ్రహాల సంచారం ప్రకారం ఈ రోజు సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మకరరాశిలో ఉదయిస్తున్నాడు. మరోవైపు బృహస్పతి మిధున రాశిలో ఉండటం వల్ల ఆర్థికంగా కొన్ని రాశులకు లాభదాయక ఫలితాలు అందే అవకాశం ఉంది.
మేష రాశి
నేడు మేష రాశి జాతకులకు పని భారం ఎక్కువగా అనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే ఓర్పుతో ముందుకు సాగుతారో వారికి మంచి ఫలితాలు అందుతాయి. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ మాటతీరుతో సమస్యలను పరిష్కరించగలుగుతారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకుల మనసుకు నేడు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.
సింహ రాశి
నేడు సింహ రాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి
నేడు కన్యా రాశి వారికి పనుల్లో ఆలస్యం కలగవచ్చు. సహనం చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల రాశి
తులా రాశి జాతకులకు కుటుంబ, ప్రేమ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిని అనుకోని వార్తలు కలవరపెట్టవచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు విద్య, ఉద్యోగ రంగాల్లో పురోగతి సాధిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకర రాశి
నేడు మకర రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు నేడు చంద్రుడు, శని ప్రభావంతో ఆలోచనలు గంభీరంగా ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మీన రాశి
మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇది మీన రాశి వారికి మనసుకు సంతోషం కలిగే రోజు.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే!











Click it and Unblock the Notifications