చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!
మార్చి 3, 2026న గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈరోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో, బుధుడు మకరంలో సంచార స్థితిలో ఉన్నారు. గురుడు మేష రాశిలో కొనసాగుతుండగా, శుక్రుడు, శని మరియు రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు.
నేడు కేతుగ్రస్త చంద్రగ్రహణం
కేతువు కన్య రాశిలో ఉన్నాడు. మరి నేడు కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. వివిధ గ్రహస్థితుల ప్రభావం, చంద్రగ్రహణ ప్రభావం రాశుల వారీగా మిశ్రమ ఫలితాలను అందించనుంది. కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుండగా, కొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు.

మేష రాశి
మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
వృషభరాశి
వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు కుటుంబ సంబంధిత శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభ సూచనలు ఉన్నప్పటికీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథున రాశి
మిధున వారు మాట్లాడే సమయంలో ఆలోచించి మాట్లాడటం మంచిది. కార్యాలయ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇది మిధునరాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఇంటి లేదా స్థల మార్పు ఆలోచనలు రావచ్చు. ఖర్చులు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త .
సింహ రాశి
సింహ వారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. పెద్దల ఆశీర్వాదం మరియు మద్దతు లభించవచ్చు.కానీ చంద్ర గ్రహణ ప్రభావం మీ మనసుపై బలంగా ఉంటుంది. కాబట్టి భావోద్వేగాల విషయంలో జాగ్రత్త.
కన్య రాశి
కన్యా రాశి వారికి చంద్ర ప్రభావం కారణంగా భావోద్వేగాలు అధికమవుతాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే ఇబ్బంది పడతారు.
తుల రాశి
తులారాశి జాతకులకు పాత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సౌఖ్యం ఉంటుంది. ఇది వీరికి అన్ని విధాలా మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు పనుల్లో ఆలస్యాలు ఎదురవవచ్చు. సహనంతో ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. కనుక కాస్త ఓపికతో పనులు పూర్తి చేసుకోవాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ప్రయాణ యోగం ఉంది. విద్యార్థులకు శుభ ఫలితాలు సాధ్యమవుతాయి. నేడు చంద్ర గ్రహణ ప్రభావం కొద్దిగా వీరిపైన కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త.
మకర రాశి
మకర రాశి జాతకులు ఉద్యోగంలో ప్రశంసలు పొందవచ్చు. కుటుంబంతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. నేడు వీరు శుభ ఫలితాలను చూస్తారు.
కుంభ రాశి
కుంభరాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆర్థిక లాభం కలగవచ్చు. ఏ పని చేసినా కుంభరాశి వారికి మేలు జరుగుతుంది.
మీన రాశి
మీనరాశి జాతకులకు శుక్ర, శని, రాహు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శాంతంగా, సమతుల్యంగా వ్యవహరించడం ఈరోజు మేలు చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications