Today rashiphalalu: నేడు రెండు అద్భుత యోగాలు.. వీరికే సకల సంపదలు!
నేడు జూలై 16 వ తేదీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రకారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సూర్యుడు మిధున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. సూర్య చంద్రుల కలయికతో పరివర్తన యోగం, కర్కాటకంలో ఉన్న గురుడితో సూర్యుడి కలయిక కారణంగా గురు ఆదిత్య యోగం ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావం 12 రాశులపైన బలంగా ఉంటుంది.
మేషరాశి
మేష రాశి జాతకులకు కొత్త పనులు ప్రారంభించటానికి ఇది అనుకూలమైన రోజు. నేడు ఉద్యోగాలు చేసేవారికి శ్రమ కు తగిన గుర్తింపు వస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. నూతన ప్రాజెక్ట్ లు చేతికి వస్తాయి.

వృషభ రాశి
నేడు వృషభ రాశి జాతకులు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం . పని చేసేచోట సహోద్యోగులతో చిన్న విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాట తీరుపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు నేడు ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎప్పటి నుండో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ పనుల్లో అనుకూలత లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు బాగుంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధికంగా నేడు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు నేడు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
తులారాశి
తులారాశి జాతకులకు కెరీర్ పరంగా గొప్ప విజయాలు చోటు చేసుకుంటాయి. పై అధికారుల మద్దతుతో పదోన్నతులు పొందుతారు. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు దూర ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. తండ్రి వైపు నుండి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార లావాదేవీల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. వాహనాలు నడిపెటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నేడు మంచి రోజు. ఈరోజు స్నేహితుల సహకారం ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారు నేడు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే శారీరక శ్రమ పెరుగుతుంది.
మీన రాశి
నేడు మీన రాశి వారికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా విద్యార్థులకు కళాకారులకు కలిసి వస్తుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. సృజనాత్మక తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications