ఈరోజు రాశి ఫలాలు: ఈ ఆరు రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!!
ఈ రోజు రాశి ఫలాలలో ఈ ఆరు రాశుల వారికి ప్రయాణాలలో, ఆరోగ్యంలో, మాట్లాడే సమయంలో, నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది.
నేడు కొన్ని రాశుల వారికి అదృష్టం బాగుంటే, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ముఖ్యంగా ఆరు రాశుల వారికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి.

మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు ఎక్కువగా పని చేయవలసి ఉంటుంది. శరీరం ఎక్కువగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మీ వ్యాపారంలో కొంత డబ్బు సీనియర్లు ఖర్చు చేస్తారు. మిధున రాశివారికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు మాత్రం తమ ఉద్యోగాలలో పురోగతిని చూస్తారు. కాబట్టి మిధున రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. స్నేహితులతో సుఖదుఃఖాలను పంచుకునే అవకాశం ఉంది. వాదోపవాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కనక మకర రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి పరిస్థితి కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరితోనూ వాదించకూడదని, వివాదాలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించబడింది.

సింహరాశి
ఇక సింహ రాశి వారి నేటి ఫలితాలు చూస్తే సింహ రాశి వారికి నేడు జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నేడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అధికారులను కలవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మీకు రావలసిన ధనం నేడు తిరిగివచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని సలహా ఇవ్వబడింది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలలో లాభం జరిగితే కొన్ని విషయాలలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చెప్పబడింది. అయినప్పటికీ ధనుస్సు రాశి వారికి వ్యాపారం బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆగిపోయిన న్యాయపరమైన పనులు పూర్తవుతాయి. వివాహం కాని వారికి వివాహం చేయడానికి మంచి సంబంధాలు దొరుకుతాయి.

మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వస్తాయి. ఇష్టానికి విరుద్ధంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వాతావరణం మార్పు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కుటుంబంతో కలిసి ఈరోజు గడిపే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications