నేడే తొలి ఏకాదశి: లక్ష్మీ కటాక్షం కావాలంటే చెయ్యవలసిన, చెయ్యకూడని పనులివే!!
తెలుగు వారందరికీ తొలి పండుగ తొలి ఏకాదశి. నేడు తొలి ఏకాదశి పండుగ. ఇక నేటి నుండి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి పండుగని, దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి నేడు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే ఈ ఏకాదశి పండుగకు చాలా విశిష్టత ఉంటుంది. శ్రీమహావిష్ణువు నేటి నుండి యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అని హిందూ వైదిక ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
నాలుగు నెలల పాటు యోగనిద్రకు శ్రీ మహావిష్ణువు
శేషతల్పంపైన శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. మొత్తం ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైన మాసంగా, హిందువులు కొనసాగిస్తారు.

చాతుర్మాస ప్రారంభం రోజున చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి
అయితే శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన తొలి ఏకాదశి పర్వదినాన, చాతుర్మాస ప్రారంభం రోజున కొన్ని చేయవలసినవి, చేయకూడనివి పనులు ఉన్నాయి. ఇవి హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి గృహస్తు తప్పక తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం. తొలి ఏకాదశి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిదని చెబుతారు. నేడు పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదట. అంతేకాదు ఉసిరితో చేసిన ఆహారాలు, గుమ్మడికాయలు, మినుములు, జంక్ ఫుడ్స్ తదితర ఆహారాలను తినకూడదని చెబుతారు.
ఏకాదశి రోజున ఇలా చేస్తేనే మంచిది
అత్యంత నిష్టతో శ్రీమహావిష్ణువుకు ఉపవాసం ఉంటే ఆ మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఆలోచనలు చేయకూడదు. ఎవరికి హాని చెయ్యకూడదు. మహావిష్ణువుకి నిష్టగా పూజలు చేయాలి. ఇలా చేసిన వారికి శ్రీమహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. అంతేకాదు ఏకాదశి పర్వదినాన దానధర్మాలు చేస్తే మంచిది.
ఏకాదశి నాడు ఇలా చేస్తే విష్ణు కటాక్షం
దానధర్మాలు చేస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున బ్రహ్మచర్యాన్ని ఆచరించి దానధర్మాలు ఎవరైతే చేస్తారో వారికి శుభం జరుగుతుంది. శరీరాన్ని, మనసుని విష్ణువు పైన లగ్నం చేసి పూజించిన వారికి విష్ణు కటాక్షం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున ఎవరైతే శ్రీమహావిష్ణువుని తులసీదళాలతో పూజిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను చెట్టు మీద నుంచి తుంచకూడదు.
సకల పాపాలు పోవాలంటే ఏకాదశి నాడు ఇలా చెయ్యండి
రోజంతా భక్తితో ఉపవాసం చేసి పూజ చేస్తే మంచి జరుగుతుంది. రాత్రిపూట జాగారం చేసి ద్వాదశి రోజు తెల్లవారుజామున తల స్నానం చేసి శ్రీమహావిష్ణువుని పూజించిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. దీంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కనుక తొలి ఏకాదశి రోజున చేయవలసినవి, చేయకూడనివి తెలుసుకుని తగిన విధంగా విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications