జులై 2024లో ప్రధాన గ్రహాల సంచారం.. ఈ రాశులవారికి కష్టాలు.. జాగ్రత్త!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జాతకాలను నిర్ణయిస్తుంది. జులై నెలలో సూర్యుడు, అంగారకుడితో సహా నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాయి. జులై నెలలో గ్రహాల గమనం ఏ విధంగా ఉండబోతుంది దానివల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనబోయే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

జులైలో గ్రహాల సంచారం ఇలా
జులై నెలలో జూలై ఏడవ తేదీన శుక్రుడు మిధునరాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తరువాత జూలై 12వ తేదీన కుజుడు వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. ఆపై జులై 16వ తేదీన కర్కాటక రాశిలో సూర్య సంచారం జరగనుంది. అనంతరం జులై 19వ తేదీన సింహరాశిలో బుధసంచారం జరగనుంది. ఇక ఈ గ్రహాల మార్పు కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు.

Transit of major planets in July 2024 Difficulties for these zodiac signs Beware

కర్కాటక రాశి
జులై నెలలో కర్కాటక రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జులై నెలలో సంభవించే గ్రహాల సంచారం కారణంగా వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వీరు చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. కొన్ని రకాల వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జులై నెలలో నాలుగు గ్రహాల మార్పు వల్ల కష్టాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఆర్థిక నష్టం జరుగుతుంది. పిల్లల వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసేవారు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ధనుస్సు రాశి
జులై నెలలో ధనుస్సు రాశి జాతకులు ఇబ్బందులు పడతారు. ఈ నెలలో వ్యాపారస్తులు నష్టాలను చవిచూస్తారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం గొడవలతో ఇబ్బందులతో ప్రశాంతత లేకుండా మారుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు నష్టాలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది.

మీనరాశి
జులై నెలలో మీన రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెలలో ఆర్థికపరమైన ఇబ్బందులను చూస్తారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+