ఆగస్ట్ 18వరకు ఈ రాశులకు ఐశ్వర్యం, అన్నింటా విజయం .. మీరున్నారా?
ద్వాదశ రాశుల వారి జాతకాలలో ముఖ్యమైన గ్రహాల సంచారం అనేక కీలక మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా ధైర్యాన్ని కోపాన్ని సూచించే గ్రహమైన కుజుడు ఇటీవల జూలై 1వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించి ఆగస్టు 18వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. సింహరాశిలో కుజ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది.
సింహరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు, కుజుడుతో కలిసినప్పుడు కొన్ని రాశి చక్రాల వారికి త్రికోణ యోగం ఏర్పడుతుంది. సింహరాశిలో కుజుడి కదలిక మేషరాశి వారికి అనుకూలతలను తెస్తుంది. మేషరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. మేషరాశి జాతకులు ధైర్యం పెరుగుతుంది. వారు విరోధులను సునాయాసంగా జయించడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలకు ఆస్కారం ఉంటుంది.

సింహరాశిలో కుజ సంచారం మిథునరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. మిధునరాశి వారు ఆర్థిక వృద్ధిని పొందుతారు. మిధునరాశి వారి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ సమయంలో ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల విజయం సొంతమవుతుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. కొత్త వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మిధునరాశి వారు ఏ పని చేసినా లాభదాయకంగా ఉంటుంది.
సింహ రాశిలో కుజ సంచారం ఫలితంగా సింహరాశి వారు అత్యంత అదృష్టవంతులుగా చెప్పొచ్చు. ఆగస్టు 18 వ తేదీ వరకు వీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. కొత్త వస్తువులు, కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి వీలుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ ఆఫర్లను అందుకుంటారు.
అసలు సింహరాశిలో కుజ సంచారం మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 18వ తేదీ వరకు ఆశించిన అన్ని ఫలితాలు వస్తాయి. ప్రమోషన్లకు ఆస్కారం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది.
సింహరాశిలో కుజ సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి జీవితం మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపార ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా ధనుస్సు రాశి వారు లాభపడతారు. ఆస్తుల పంచాయతీలకు పరిష్కారాలు దొరుకుతాయి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. పూర్వీకుల ఆస్తుల నుండి లాభాలతో పాటు, వ్యాపారంలో విజయం సాధ్యమవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications