తులారాశిలో కుజ సంచారం.. నాలుగు రాశులవారికి నష్టం; జాగ్రత్త!!
అక్టోబర్ 3వ తేదీన అంటే నేడు కుజుడు తులారాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని శక్తి ,భూమి, బలం, ధైర్యం, మరియు పరాక్రమానికి అధిపతిగా భావిస్తారు. తులారాశిలోకి కుజుడు ప్రవేశించిన తర్వాత నవంబర్ 16వ తేదీ వరకు కుజుడు ఈ రాశి లోనే ఉంటాడు. దీని తర్వాత కుజుడు వృశ్చిక రాశిలోకి వెళతాడు.
తులారాశిలో కుజుడు..4 రాశులకు నష్టం
తులారాశిలో సంచరిస్తున్న కుజుడు ఈ సమయంలో సింహరాశి, కన్య రాశి, మకర రాశుల వారికి మంచి కాలాన్ని తీసుకువస్తాడు. మరోవైపు ఇదే సమయంలో నాలుగు రాశుల వారికి సమస్యలను కూడా సృష్టిస్తాడు. నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ రాశులు ఏమిటి అంటే..

వృషభ రాశి
వృషభ రాశి వారికి తుల రాశిలో కుజుడు ప్రవేశం కష్టాలను తీసుకువస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కోపాన్ని లేదా అతి విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఈ రెండు తప్పులు చేయకుండా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అతి విశ్వాసంతో కాకుండా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి
తులా రాశిలో కుజుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఇబ్బందులు కలుగుతాయి. కర్కాటక రాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల మానసికంగా అశాంతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఒత్తిడికి కారణమవుతుంది. ఈ సమయంలో విజయం సాధించాలంటే కర్కాటక రాశి వారు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి
తులారాశిలో కుజుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వారు కష్టాలను ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద నష్టాలకు ఆస్కారం ఉంది. వీరి మనసు ఈ సమయంలో చంచలంగా ఉంటుంది. తొందర పాటు నిర్ణయాల వల్ల వృశ్చిక రాశి వారు పెద్ద నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు చదువులోనూ ఏకాగ్రతను కోల్పోతారు.
మీన రాశి
తులా రాశిలో కుజుడు సంచారం మీనరాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మీన రాశి వారు ఈ సమయంలో అనవసరమైన కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరిలో సహనం ఈ సమయంలో తగ్గుతుంది. అనవసరమైన ప్రయాణాలను చేయవలసి వస్తుంది. ఆరోగ్యం క్షమిస్తుంది కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications