2024లో శని సంచారం.. ఆరు రాశులవారికి ఆరోగ్య నష్టం.. జాగ్రత్త!!
2024 సంవత్సరంలో శని సంచారం ప్రభావంతో వివిధ రాశుల వారి జాతకాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారి ఆరోగ్యం పై శని ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో ఆయా రాశుల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరి 2024 సంవత్సరంలో శని ఆరోగ్యంపై ప్రభావం చూపించే రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
2024 లో శని సంచారం కారణంగా మేషరాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శని సంచారం కారణంగా మేషరాశి వారిలో నీరసం, బద్ధకం, తలనొప్పి వంటి వివిధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉంటే నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.

2024లో శని సంచారం వల్ల కర్కాటకరాశి వారు ఆరోగ్యం బారిన పడతారు. మీరు కాళ్లనొప్పులు మరియు నరాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తీవ్ర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. వృశ్చికరాశి వారు 2024 లో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు కాళ్ల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
మద్యపానం, చెడు ఆహారపు అలవాట్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచించబడింది. 2024లో శని గ్రహ సంచారం వల్ల మకర రాశి వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు కంటి నొప్పి, పంటి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి కళ్ళు, పళ్ళు విషయంలో మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
కుంభరాశి వారు 2024 సంవత్సరంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శని గ్రహం యొక్క స్థాన ప్రభావం వల్ల తర్వాత బాగా క్షీణిస్తుంది. ఒత్తిడితోపాటు కాళ్లు నొప్పి, నడుమునొప్పి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఆరోగ్య వ్యయం పెరిగే ప్రమాదం ఉంది. 2024 లో మీనరాశి వారికి శనిగ్రహ ప్రభావం వల్ల వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఫలితంగా వారు నిద్రలేమి, కాళ్ల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications