కన్యారాశిలో సూర్య సంచారం.. ప్రతికూలతలకు పరిహారాలివే!!

మనిషి జీవితం మీద గ్రహాల యొక్క ప్రభావం కచ్చితంగా ఉంటుంది. గ్రహాలు వివిధ రాశుల్లోకి గమనం చేసేటప్పుడు అవి వివిధ రాశుల వారి జీవితాల పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం కన్య రాశిలో సూర్య సంచారము కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలతలను కలిగిస్తుంది. అయితే ప్రతికూల ఫలితాలను అధిగమించాలంటే పరిహారాలను చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం. సూర్యుడు ప్రతికూలతలను కలిగిస్తే అది ఆరోగ్యపరంగా ప్రభావం చూపిస్తుంది. మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కావాలి అనుకుంటే సూర్యుడికి సంబంధించి కొన్ని పరిహారాలను కచ్చితంగా చేయాలి. మరి ఆ పరిహారాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Transit of Sun in Virgo..negativity needs to be remove with these remedies

కన్య రాశిలో సూర్యుడు సంచరిస్తున్న సమయంలో ప్రతికూల ఫలితాలు కలిగే రాశుల వారు ఆదివారాలలో బెల్లం, గోధుమలు, రాగి వంటి వాటిని దానం చేయడం మంచిది. దానధర్మాలు చేసిన వారికి సూర్యుడు దయ ఖచ్చితంగా ఉంటుంది. ఆదివారాలు ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోయడం వల్ల సూర్యుడు దయ కచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యభగవానుడి ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలతలు కలుగుతాయి.

సూర్యుడు దయ కావాలనుకునేవారు ఎరుపు రంగు దుస్తులను, ఆరెంజ్ కలర్ దుస్తులను తరచుగా ధరిస్తే మంచిదని చెబుతున్నారు. సూర్యుడు అనుగ్రహం కోసం శివుని ఆరాధించాలని, శివుడికి రుద్రాభిషేకం చేయాలని చెబుతున్నారు. సూర్య యంత్రాన్ని స్థాపించి, సూర్య భగవానుడిని పూజించడం వల్ల కూడా సూర్యుని పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు.

ప్రతీ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని నివేదన చెయ్యటం వల్ల కూడా ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలతలు కలుగుతాయని అంటున్నారు.ఈ పరిహారాలతో సూర్యుని కటాక్షాన్ని సంపూర్ణంగా పొందొచ్చని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. గ్రహాలకు రారాజైన సూర్యుడి దయ ఉంటె జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+