సూర్యుడి సంచారంతో ఈ రాశులవారికి మహర్దశ
జ్యోతిష్యంలో సూర్య భగవానుడిని రాజుగా పరిగణిస్తారు. ఈనెల 15వ తేదీన ఆదిత్యుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడిని గౌరవానికి, విజయానికి కారకుడిగా భావిస్తారు. భానుడు జెమినీలో సంచరించడంవల్ల నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులవారు ఎవరెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశివారికి సూర్యుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతోపాటు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి.

సింహరాశి: భానుడు మిథునరాశిలోకి ప్రవేశించడం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. అదృష్టం ఎప్పుడూ వెంట ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
కన్యా రాశి: ఈ రాశివారికి సూర్యుడి సంచారం బాగా కలిసివస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా కోర్కెలను నెరవేర్చుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవడంతోపాటు ఊహించని ధనలాభం పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది.
కుంభ రాశి: సూర్యుడి సంచారం కుంభరాశివారికి బాగుంటుంది. వీరు చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీనిద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ సమయం కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications