సంవత్సరం తర్వాత మేషరాశిలోకి సూర్యుడు.. అదృష్టమంతా ఈ రాశుల వారిదే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజైన సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం 3.12 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మే 15వ తేదీ ఉదయం 11.58 గంటల వరకు ఈ రాశిలోనే ఉంటాడు. దీని తర్వాత వృషభ రాశిలోకి సూర్యగ్రహం ప్రవేశిస్తుంది. సంవత్సరంలో 12 సార్లు గ్రహాల రాజులు రాశిని మారుస్తారు. దీనివల్ల అన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడి సంచారం వల్ల మేష రాశి, మిథున రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో లాభాలను పొందుతారు.
మేష రాశి
సూర్యుడు ఏడాది తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కెరీర్ లో ముందడుగు పడుతుంది. వ్యాపారస్తులకు లాభం ఉంటుంది. పనిచేసే కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితం లభించడమే కాకుండా ఇంక్రిమెంట్, ప్రమోషన్ ఉంటాయి. ప్రమోషన్ వల్ల పనిభారం పెరుగుతుంది.

మిథున రాశి
మేషరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఈ మిథునరాశివారు ఎక్కువగా లాభపడనున్నారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు లభ్యమవుతాయి. ఆదాయం గణనీయంగా ఉండటమే కాకుండా కష్టపడి పనిచేసే వారికి పూర్తి ఫలితాలు లభిస్తాయి. వారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి అనేక ప్రయోజనాలు దక్కుతాయి. కలుగుతాయి. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆ దిశగా వారు చేసే ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. అన్నిరంగాల్లోను వీరు విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
ఈరాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. దీంతో ప్రతి రంగంలోనూ విజయం సాధించడమే కాకుండా కెరీర్‌లో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications