మూడు అద్భుత యోగాలతో ఈ రాశులవారి పంట పండుతుందని చెప్పిన త్రి ఆదిత్య యోగం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి అని మనకు తెలిసిందే. ప్రస్తుతం మిధున రాశిలో కొన్ని అరుదైన శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. మిధున రాశిలో కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతున్నటువంటి యోగాలు అనేక రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. జూన్ 22వ తేదీన మిధున రాశిలో బుధుడు సూర్యునితో కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరిచాడు.

త్రి ఆదిత్య యోగం
24వ తేదీన మిధున రాశిలో చంద్ర సంచారం జరగనుంది. మిధున రాశిలో సూర్యచంద్ర సంచారంతో చంద్ర ఆదిత్య యోగం ఏర్పడబోతోంది. అంతేకాదు మిధున రాశిలో సూర్యుడు గురువు కలిసి గురు ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్న కారణంగా కొన్ని రాశుల వారు సూర్యుడు కారణంగా ఏర్పడే త్రి ఆదిత్య యోగాలతో అదృష్ట జాతకులు అవుతున్నారు. మూడు ఆదిత్య యోగాలు మిధున రాశిలో కలపడం కారణంగా త్రి ఆదిత్య యోగం ఏర్పడింది.

Tri aditya yoga gives luck to these zoidac signs with three auspicious yogas

మిధున రాశి
మిధున రాశి వారికి త్రి ఆదిత్య యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే మిధునరాశి వారికి కలిసొస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏ పని చేసిన సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది.

కన్య రాశి
కన్యా రాశి వారికి త్రి ఆదిత్య యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి జాతకులకు ఈ యోగం కారణంగా కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఆర్థికపరంగా మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి.

ధనుస్సు రాశి
త్రి ఆదిత్య యోగం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇది ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి త్రి ఆదిత్య యోగంతో కలిసొస్తుంది. దీంతో కుంభరాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ పరంగా, వ్యాపారపరంగా అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు.

మీన రాశి
త్రి ఆదిత్య యోగంతో మీనరాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీన రాశి వారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇది మీన రాశి వారికి అదృష్ట సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+