వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayurvedam:"త్రిఫల చూర్ణంతో ఎన్నెన్నో ప్రయోజనాలు"

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు. మనిషి యొక్క ఆరోగ్యం అనేది వాత, పిత్త, కఫ, లక్షణాల హెచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. ఈ హెచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.

కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెటలోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహ చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన *త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది. ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది. జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్య పోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.

Triphala Choornam: This ayurvedic medicine cures many ailments

ఆయుర్వేద చికిత్స :- పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా ఋతువులలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

త్రిఫలచూర్ణమును త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫ దోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించింది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫ దోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్త శక్తిని ఇచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు.

ఉసిరి గుణాలు:- ఉసిరి: ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియాలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్ధమును తగ్గిస్తుంది. విరేచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.
బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిను ఉసిరిలో ఉంది.

తానికాయ గుణాలు :- తానికాయ: తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది. దీనిలో విటమిను 'ఏ' అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.

కరక్కాయ గుణాలు:- కరక్కాయ: త్రిఫల చూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు వ్యర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.

వాడే విధానం, ఉపయోగాలు :- త్రిఫలను నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చును. రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. మీ శరీరతత్వాన్ని బట్టి వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. త్రిఫల తయారీ కోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి ఉంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెడును చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి. మలబద్ధము బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.

ఒక చెంచా త్రిఫల చూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చును.

త్రిఫల చూర్ణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి :-

* త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.

* గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

* జుట్టును త్వరగా తెల్లగా అవ్వనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.

* ముసలితనం త్వరగా రానీయదు.

* జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.

* ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.

* రోగ నిరోధక వ్యవస్థను బాగా శక్తివంతం చేస్తుంది.

* ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది, ఆకలిని బాగా పెంచుతుంది.

* ఆమ్లత ( అసిడిటీ ) ను తగ్గిస్తుంది.

* వాతం నొప్పులు తగ్గుతాయి.

* యూరినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.

* సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.

* శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపులో ఉంటాయి.

* కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

* శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.

* పెద్ద ప్రేవులను శుభ్రంగా ఉంచి, పెద్ద ప్రేవులకు ఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.

* అధిక బరువును అరికడుతుంది.

* శరీరంలోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.

* శరీరంలో బాక్టీరియాను వృద్ధి కాకుండా ఆపుతుంది.

* కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది, కాన్సరును కూడా నిరోధిస్తుంది.

* రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తపోటును ( B.P) అదుపులో ఉంచుతుంది.

* ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.

* సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.

* చక్కగా విరేచనం అయేలా చేస్తుంది, మలబద్ధకాన్ని పాగోడుతుంది.

* హెచ్ ఐ వీని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.

* నేత్రవ్యాధులను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది, కంటిచూపును పెంచుతుంది.

* చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

English summary
Crushed Triphala is a mixture of amaranth, cucumber and tamarind. It is used in Ayurvedic medicine for the treatment of various ailments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X