బుధ గోచారంతో ఈ రాశులవారిని తరుముకొస్తున్న కష్టాలు... నివారణలిలా!

సెప్టెంబర్ 4వ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఉదయం 11:30నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు మరియు బుధుడు ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండడం వల్ల సింహరాశిలో బుధ సంచారం ఒక శుభ పరిణామం అయితే సింహరాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశులవారు శుభ ఫలితాలను పొందుతుంటే, మరికొన్ని రాశులవారు ప్రతికూలమైన ఫలితాలను పొందుతున్నారు. ప్రతికూలమైన ఫలితాలను పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో బుధుడు మూడవ మరియు 12వ ఇంటిని పాలిస్తాడు. ప్రస్తుతం సింహరాశిలో బుధుడు సంచారంలో రెండో ఇంట్లోకి బదిలీ అవుతాడు. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉండదు. కుటుంబ కలహాలతో ఇబ్బంది పడతారు .విదేశాలకు ప్రయాణం చేసేవారు ఆశించిన ఫలితాలను పొందలేరు. ఇష్టమైన వారితో సంబంధాలు దెబ్బతింటాయి. కంటి సంబంధిత వ్యాధులు, అలర్జీలతో బాధపడతారు.

Troubles are chasing these zodiac signs with the transit of Mercury in leo these are the remedies

వృశ్చిక రాశి
బుధుడు వృశ్చికరాశి వారికి ఎనిమిదవ ఇంటికి, 11వ ఇంటికి అధిపతిగా ఉంటాడు అయితే ప్రస్తుతం సింహరాశిలో బుధ సంచారం సమయంలో బుధుడు వృశ్చికరాశిలో పదవ ఇంట్లో ఉంటాడు. బుధుడు ఎనిమిదవ ఇంటికి అధిపతి కావడం వలన ఈ కాలం వృశ్చికరాశి వారికి కెరీర్ చాలా కష్టతరంగా మారుతుంది. సీనియర్లతో మంచి సన్నిహిత్యం లేకపోవడం వలన ఇబ్బందులు పడతారు. అవాంఛిత బదిలీలు ఉద్యోగ మార్పులు సంభవిస్తాయి. తల్లితో తరచూ గొడవలు జరుగుతాయి.

జాతకంలో బుధుడు బలోపేతం కావాలంటే ఇలా చెయ్యాలి
ఇక సింహరాశిలో బుధ సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చేవారు కొన్ని నివారణలను పాటిస్తే బుధుడి కటాక్షం ఉంటుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి జాతకులు జాతకంలో బుధుడిని బలోపేతం చేయడానికి వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి లడ్లు, పత్రి సమర్పించి పూజలు చేయాలి. బుధుడిని జాతకంలో బలోపేతం చేయడానికి యజ్ఞం సహాయపడుతుంది.

ఇలా చేస్తే ప్రతికూలతలు తగ్గుముఖం
ఇంట్లోని మహిళలకు కొత్త దుస్తులను, ఆకుపచ్చ కంకణాలను ఇస్తే కూడా మంచి జరుగుతుంది. మీ కుడి చేతి చిటికెన వేలు పైన పచ్చరాతితో ఉంగరాన్ని ధరిస్తే కూడా బుధ ప్రతికూలత తగ్గుతుంది. నిరుపేదలకు ఆహారాన్ని పెట్టడం, పక్షులకు, చిలుకలకు, పావురాలకు ఆహారాన్ని తినిపించడం చేస్తే కూడా జాతకంలో బుధుని యొక్క ప్రతికూలతలు తగ్గుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+