జాతకంలో బృహస్పతి బలంగా ఉండాలంటే ఈ నివారణలు ట్రై చెయ్యండి

బృహస్పతి దేవతలకు గురువు. సౌర మండలంలో అతి పెద్ద గ్రహం, ముఖ్యమైన గ్రహం కూడా బృహస్పతినే. సహజంగా మేలు చేసే గ్రహాలలో బృహస్పతి ఒకటి. అయితే మీరు బృహస్పతితో స్నేహంగా లేని లగ్నంలో ఉంటే తరచుగా బృహస్పతి బలహీనంగా ఉంటాడు. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ రాశులవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

బృహస్పతి బలపడటానికి నివారణలు
బృహస్పతి జ్ఞానానికి, బుద్ధికి సంబంధించిన గ్రహం. దీంతో ముఖ్యంగా వ్యక్తి యొక్క జ్ఞానంపై ప్రభావం పడుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. బృహస్పతి బలహీనంగా ఉంటే జీర్ణ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే రాశులవారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు కొన్ని నివారణలు చేస్తే బృహస్పతి బలపడి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

Try these remedies to keep Jupiter strong in your horoscope

బృహస్పతి బలహీనపడాలంటే గురువారం ఇలా చెయ్యండి
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు పెద్దలను, బ్రాహ్మణులను, గురువులను ఎల్లవేళలా గౌరవించాలి. మీ పిల్లలతోనే కాదు, మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాలి.బృహస్పతి బలపడాలంటే ఎప్పుడూ ఎవరినీ తప్పు దారి పట్టించొద్దు. జాతకంలో గురువు బలంగా ఉండాలంటే పసుపు రంగు దుస్తులు ధరించి, గురువారం రోజు ఉపవాసం ఉండి శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

ఇవి దానం చేస్తే బృహస్పతి బలోపేతం
శివుడిని పూజించటంతో పాటు, శివ సహస్త్రాణం స్తోత్రాన్ని జపిస్తే కూడా జాతకంలో బృహస్పతి బలోపేతం అవుతాడు. జాతకంలో బృహస్పతి బలంగా మారడానికి స్వచ్చమైన నెయ్యి, పుస్తకాలు, పసుపు పువ్వులు, శనగపప్పు వంటి పసుపు రంగులో ఉండే పదార్ధాలను దానం చెయ్యాలి. బృహస్పతి బలం తక్కువగా ఉంటే నుదుటిపై పసుపు లేదా గంధంతో బొట్టు పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలు ధరించాలి.

బృహస్పతి ఇలా చేస్తే బలం పుంజుకుంటాడు
మాంసాహారం తినకూడదు . మద్యం సేవించకూడదు. సమాజానికి నిస్వార్ధంగా సేవ చెయ్యాలి. బహిరంగ ప్రదేశాలలో స్నానం చెయ్యకూడదు. తోబుట్టువులకు సాధ్యమైనంత వరకు సాయం చెయ్యాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించటం కోసం 8 రోజులపాటు పసుపును దేవాలయానికి దానం ఇవ్వాలి. గురుఉ అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా అందరికీ పంచి పెట్టాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+