అద్భుత రాజయోగాలతో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రాశులివే!
గ్రహాల కదలికలు, గ్రహాల సంయోగాలు మానవుల జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 14వ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించి, శుక్రుడు మరియు బుధుడుతో కలిసి బుధాదిత్య , శుక్రాదిత్య రాజయోగాలను ఏర్పరిచారు. ఈ రాజయోగాలు ప్రభావం అన్ని రాశుల వారి పైన ఉంటుంటే, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఇది మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రాజయోగాల కారణంగా అదృష్టవంతులుగా మారిన ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈ నెలలో బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాల కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇది వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. వృషభరాశి వారి సంపద పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలించి ఉన్నత స్థానాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీగానే ఆదాయం వస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో శక్తివంతమైన బుధాదిత్య మరియు శుక్రదిత్య రాజయోగాలను ఏర్పరుస్తాడు. ఇక దీంతో ధనుస్సు రాశి వారి సామాజిక హోదా పెరుగుతుంది. ఆదాయం పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు పెద్దపెద్ద ఒప్పందాలను చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది.
తులారాశి
తులారాశిలో 11వ ఇంట్లో శక్తివంతమైన బుధాదిత్య, శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో తులారాశి వారు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తిపరంగా కూడా మీరు ప్రయత్నాలు గుర్తించబడతాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారు భారీ ఆదాయాన్ని పొందుతారు. వ్యక్తిగతంగా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications