2025లో ఈ రాశులకు అద్భుత రాజయోగాన్ని ప్రకటించిన కేతువు

ఖగోళంలో నవగ్రహాల సంచారం మొత్తం ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతోందనే విషయం తెలిసిందే. 2025 ప్రత్యేక ఏమిటంటే.. ఈ ఏడాదిలో అన్ని గ్రహాలు రాశులను మార్చుకుంటున్నాయి. చాలా నెమ్మదిగా తిరోగమన దిశలో పయనించే కేతువు కూడా ఈ ఏడాది తన రాశిని మార్చుకొని సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి వారు మొదటినుంచి కలలు కంటున్న జీవితం సొంతమవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుండటంతోపాటు పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. కేతువు అంటే నీడ గ్రహమని అందరూ భయపడతారు. కానీ అశుభాలనే కాదు.. శుభాలను కూడా కేతువు ఇస్తుంది. ఈ ప్రభావంవల్ల రెండు రాశులకు మహారాజయోగం పట్టబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మీనరాశి
కేతువు వల్ల ఈ రాశివారికి విశేష రాజయోగం పట్టబోతోంది. అనేక ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వీరు చక్రం తిప్పుతారని చెప్పొచ్చు. కేతువువల్ల కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారిని కలుస్తారు. వివాహం చేసుకునే అవకాశం ఉంది. అది వారిద్దరిపై ఆధారపడివుంటుంది. కోరుకున్నవారినే పెళ్లి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల అనుమతి లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కలుగుతుంది. కొత్తగా ఆర్డర్లు లభిస్తాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. అయితే తోటి ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

two zodiac signs will get excellent rajayoga due to ketu transit in leo

మిథున రాశి
పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభం కలుగుతుంది. అప్పులు చేసినవారికి వారి అప్పులన్నీ తీరిపోతాయి. మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అందివచ్చిన అవకాశాలను పుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశివారికి ఇది సువర్ణ యోగం అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడి, సఖ్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. సంపాదించే డబ్బును బాగా పొదుపు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. బంధువులతో ఉన్న విభేదాలన్నీ తగ్గిపోతాయి. ఈ మంచి సమయాన్ని అనువుగా మార్చుకోవాల్సిన బాధ్యత ఈ రాశివారిపైనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+