'గోంగూర చికెన్'.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే చికెన్ తో ఎప్పుడూ ఒకేరకమైన వంటకం చేసి బోర్ కొట్టిందా..? అయితే నయా స్టైల్ లో గోంగూర చికెన్ ను ఎప్పుడైనా ట్రై చేశారా..? ఒక్కసారి చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. గోంగూర చికెన్ ను ఇలా ఈజీగా చేసుకోండి.. కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
గోంగూర చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ 500 గ్రాములు, గోంగూర రెండు కప్పులు తరిగినవి, ఉల్లిపాయలు రెండు పెద్దవి, టమాటాలు రెండు మధ్యస్థ సైజులో, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్ లు, జీలకర్ర అర టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు తగినంత తీసుకోవాలి.
ఇప్పుడు గోంగూర చికెన్ తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి ఉప్పు, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్ వేసి 15 నిమిషాల పాటు మేరినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో మూడు టేబుల్ స్పూన్ లు నూనె వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించుకోవాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసి మెత్తబడేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మేరినేట్ చేసిన చికెన్ వేసి అందులో కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఐదు నుంచి ఆరు నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు తరిగిన గోంగూరను వేసి బాగా కలిపాలి. ఆ తర్వాత మూతపెట్టి 10 నుంచి 12 నిమిషాలు మధ్య మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా గరం మసాలా వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications