రొనాల్డో.. మా సంజు శాంసన్ ను ఆదర్శంగా తీసుకున్నావేటి
ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి విఫలం అయ్యాడు. కొలరాడోతో జరిగిన మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. గత మూడు మ్యాచ్ లల్లో గోల్ లెస్ కావడం ఇది రెండోసారి. ఉజ్బెకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో చెలరేగినప్పటికీ.. ఆ తర్వాత చతికిలపడ్డాడు. తొలి మ్యాచ్ లో మొరాకోపైనా ఒక్క గోల్ కూడా కొట్టలేదు. నిలకడను కోల్పోయాడు. మొత్తంగా పోర్చుగల్- కొలరాడో మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. 0-0తో మ్యాచ్ ముగిసింది. అయినప్పటికీ ఈ రెండు జట్లు కూడా నాకౌట్స్ కు అర్హత సాధించాయి.
మయామి స్టేడియంలో గ్రూప్ కే లో చివరి మ్యాచ్ ఇది. కొలంబియా, పోర్చుగల్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు 0-0 తో డ్రాగా ముగిసినప్పటికీ, మైదానంలో ఇరు జట్ల ఆటతీరు అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ డ్రాతో రెండు జట్లు కూడా రౌండ్ ఆఫ్ 32 కు అర్హత సాధించాయి. కొలంబియా గ్రూప్ కే టేబుల్‌లో అగ్రస్థానంలో నిలవగా, పోర్చుగల్ రెండో స్థానంతో తదుపరి రౌండ్‌కు ప్రవేశించింది.

ఈ మ్యాచ్ కు 64,478 మంది ప్రేక్షకులు తరలివచ్చారు. ముఖ్యంగా పసుపు జెర్సీలు ధరించిన కొలంబియా మద్దతుదారుల కేరింతలతో మైదానం అంతా హోరెత్తిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే కొలంబియా స్ట్రైకర్ జాన్ కార్డోబా హెడర్ ద్వారా గోల్ చేసే సువర్ణావకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కొలంబియా మిడ్‌ఫీల్డర్ జాన్ అరియాస్.. ఆకట్టుకున్నాడు. గ్రౌండ్ లో పాదరసంలా కదిలాడు. పోర్చుగల్ డిఫెన్స్ పై నిరంతరం ఒత్తిడి తెచ్చాడు.
ఆట 17వ నిమిషంలో అరియాస్ అందించిన అద్భుతమైన పాస్‌ను అందుకుని కార్డోబా కొట్టిన బలమైన షాట్‌ను పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అరియాస్ కొట్టిన మరో షాట్‌ను పోర్చుగల్ డిఫెండర్ రూబెన్ నెవ్స్ గోల్ లైన్ వద్ద చాకచక్యంగా క్లియర్ చేసి తమ జట్టును ప్రమాదం నుంచి ఆదుకున్నాడు.
మరోవైపు పోర్చుగల్ జట్టు కూడా గోల్ సాధించేందుకు పోరాడింది గానీ సాధ్యం కాలేదు. ఆట 39వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన షాట్‌ను కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ అద్భుతమైన డైవ్‌తో ఆపాడు. క్రిస్టియానో రొనాల్డోకు ఈ మ్యాచ్‌లో అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. రొనాల్డో వేసిన ఒకే ఒక్క ఫ్రీకిక్ కూడా నేరుగా కీపర్ చేతుల్లోకే వెళ్ళింది. జోయావ్ ఫెలిక్స్ కొట్టిన వాలీ షాట్ కూడా గోల్ పోస్ట్ పైనుంచి వెళ్ళిపోయింది.
ద్వితీయార్థంలో కొలంబియా మరింత దూకుడు ప్రదర్శించింది. ఆట ముగియడానికి సరిగ్గా నిమిషం ముందు కొలంబియా డిఫెండర్ డావిన్సన్ సాంచెజ్ హెడర్ ద్వారా గోల్ సాధించడంతో మైదానంలో సంబరాలు మిన్నంటాయి. వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) సుదీర్ఘ సమీక్ష తర్వాత అది చాలా తక్కువ తేడాతో ఆఫ్ సైడ్‌గా తేలడంతో రెఫరీ ఆ గోల్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత ఇంజూరీ టైమ్‌లో పోర్చుగల్ యువ ఆటగాడు రాఫెల్ లియావో కొట్టిన షాట్ కూడా గోల్ పోస్ట్ పక్కనుంచి దూసుకెళ్లిపోయింది.
కొలంబియా శుక్రవారం కాన్సాస్ సిటీలో ఘనాతో జరిగే నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుంది. పోర్చుగల్ గురువారం టొరంటోలో క్రొయేషియాను ఢీ కొట్టనుంది. రెండు జట్లకూ తదుపరి మ్యాచ్‌లు అత్యంత కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications