ఈ రాశులకు టైమ్ వచ్చింది... పదేళ్లు తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టిస్తారు

నవగ్రహాల్లో ప్రత్యేకమైనది శని గ్రహం. మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే మంచి ఫలితాలను, చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. ఆయనకు ఆగ్రహం వస్తే ఎలా స్పందిస్తాడో అనుగ్రహం ఇవ్వాలన్నా అలాగే స్పందిస్తాడు. వచ్చే ఏడాది మీనరాశిలోకి ప్రవేశించనున్న శనిదేవుడు కొద్దిరోజులు అక్కడే ఉండటంవల్ల రెండు రాశులవారు తీవ్రమైన ఆర్థిక ప్రయోజనాలను పొందడంతోపాటు విపరీతంగా లాభపడుతున్నారు. పరిస్థితులన్నీ మారిపోయి అనుకోని రీతిలో వీరికి అదృష్టం కలిసివస్తోంది. వారికి ఏ విధంగా కలిసివస్తుంది? ఏవిధంగా కోటీశ్వరులవుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ శనిదేవుడి దయవల్ల ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే వీరు మహారాజులయ్యే సమయం వచ్చేసింది. లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడి వీరికి విశేష యోగం కలుగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. వారినుంచి సంపూర్ణమైన మద్దతు లభించడంవల్ల అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నివిధాలుగా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సహకారం అంది మంచి పేరును సంపాదిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అది అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కింగ్ అవుతారు.

two zodiac signs will get huge money due to lord shni transit and lakshmi narayana rajayogam

ధనస్సు రాశి
కెరీర్ ఊహించనిరీతిలో దూసుకుపోతోంది. ఎప్పటి నుంచో కంటున్న కలలన్నీ తీరతాయి. జ్యోతిష్య పండితులు చెబుతున్నదాని ప్రకారం ధనాన్ని భారీగా ఇంటికి తెస్తారు. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలు, లాభాలు కలుగుతున్నాయి. ఏ పని చేసినా వీరికి కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. శనిదేవుడితోపాటు బృహస్పతి దయవల్ల విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతోంది. వీరికి అదనపు ఆదాయం తోడవుతోంది. తద్వారా సంపద పెరిగి పొదుపు చేస్తారు. భవిష్యత్తులో రాబడినివ్వడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+