Ugadi 2025 rashiphal: మేషరాశి వారికి ఏలినాటి శని దెబ్బ.. కానీ
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రానే వస్తుంది. ఇక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ ఉగాది పండుగ తమ జీవితాలను ఏ విధంగా మార్చబోతుంది? తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తారు.
మేషరాశి ఫలం
ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేసి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తారు. ఇక ఉగాదికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ విశ్వావసు నామ ఉగాది నుండి మేష రాశి జాతకుల జాతకం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం.
మేషరాశి జాతకులకు ఎలా ఉంటుందంటే
మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. మేషరాశి జాతకులకు 2025 మధ్యస్థం నుండి చెడు ఫలితాలను అధికంగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉగాది నుండి బృహస్పతి స్థానం నందు సంకరిస్తుండగా ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభ స్థానంలోనూ, కేతువు మే నుండి పంచమ స్థానంలోనూ సంచారం చేయనున్నారు.

ఏ పని చేసినా ఫలితం ఇలా
ఈ కారణంగా మేషరాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వీరు ఏ పనులు అనుకున్న ఆలస్యం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసినా ఫలించవు. వ్యాపారస్తులకు ధన నష్టం జరుగుతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో కొంత శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఉగాది నుండి కీలక మార్పులు
శని యొక్క మార్పు, బృహస్పతి యొక్క మార్పు, రాహు కేతువుల మార్పు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు యొక్క సంచారం వలన మనిషి యొక్క జీవన విధానంలోని చాలా మార్పులు వస్తున్నాయి. ఇక మేషరాశి వారి జీవితంలో ఈ ఉగాది నుండి చాలా కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంట్లో ఉన్నటువంటి తల్లితండ్రులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ఈ రంగాల వారికి అనుకూలం, వీరికి ప్రతికూలం
అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకు సంబంధించి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. గురుడు యొక్క స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉంటుంది. చాలా అనుకూల పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే టూరిజం, కళలు, సినిమా, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగస్తులకు సంబంధించి బదిలీలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. పరిస్థితి సాపేక్షంగా ఉండడం వలన శ్రమ కచ్చితంగా అవసరం పడుతుంది.
ఉద్యోగులకు, రైతులకు ఇలా
ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అయితే కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది కానీ పన్నుల సమస్యలు వీరికి అధికంగా ఉండే అవకాశం ఉంది. మేషరాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి సినీ రంగంలో ఉండేటువంటి వారు కాంట్రవర్సీ లలోకి వెళ్ళే అవకాశం ఉంది.
వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉంటుందంటే
రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. తెలియని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. మార్చి నెలలో షష్ఠగ్రహ కూటమి పూర్తయిన తర్వాత శని వీరి జాతకంలో ప్రవేశించటం వల్ల కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసే వారికి విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శని ప్రభావంతో మేషరాశి జాతకులు ఇళ్లలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
వృద్ధాప్యంలో ఉన్న వారి పరిస్థితి ఇలా
ఈ రాశి వారికి గురువు మూడవ స్థానంలో సంచరించడం వలన వృద్ధాప్యంలో ఉన్నవారికి మానసిక, శారీరక ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలను విస్మరించకుండా వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది. మేష రాశి వారికి శని 12వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
విద్యార్థులు, స్త్రీలకు ఇలా ఉంటుంది
సోదరులు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది. స్త్రీలకు సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. మేష రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి . శని చాలీసా మంత్రాన్ని పాటించడం ఈ సమయంలో ఎంతో మంచిది. మేషరాశి జాతకులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే మంచిది. అంతేకాదు నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే కూడా మంచిది.
కష్టాల నుండి గట్టెక్కడానికి చెయ్యాల్సిందిదే
మేష రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల కుజుడికి ఇష్టమైన శరవణ మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మంచిది. ఇక వీలైనంతవరకు నెలకి ఒకసారైనా కచ్చితంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ అలాగే ఒక నెల సింధూరార్చన తదితర పూజలు చేస్తే కొంతమేరకు ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి జాతకులు కొంత మేర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications