Unlucky zodiac signs horoscope: మరో మూడురోజుల్లో ఈ రాశులవారికి ధననష్టం.. అన్నింటా కష్టం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు అతి చిన్న గ్రహం. ఇక బుధుడు జులై 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశిలోకి బుధ సంచారం వల్ల మిథున రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, తులా రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది . మీరు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది.
అయితే సింహరాశిలోకి బుధ సంచారం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.జులై 25వ తేదీన సింహరాశిలో బుధ సంచారం మేష రాశి వారికి నష్టాలను తీసుకువస్తుంది. అప్పటినుండి మేషరాశిలో బుధుడు అయిదవ ఇంట్లో సంచరించడం వల్ల ఊహించని కష్టాలు ఈ రాశి వారు ఎదుర్కొంటారు.

ఆర్థికపరమైన ఇబ్బందులను మేష రాశి వారు ఎదుర్కోవలసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు పైన ఆందోళన కొనసాగుతుంది. విపరీతంగా డబ్బు ఖర్చు పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉండవు. అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కోసం కూడా విపరీతంగా డబ్బు ఖర్చవుతుంది.
సింహరాశిలో బుధ సంచారం వల్ల వృషభ రాశి వారికి కొన్ని లాభాలు జరిగినా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వృషభ రాశిలో బుధుడు నాలుగవ ఇంట్లో సంచరించడం తోపాటు పదవ ఇంటిని కూడా పరిశీలిస్తున్నాడు. దీంతో జులై 25వ తేదీ నుండి వృషభ రాశి జాతకులు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది .
వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రత్యర్థులతో కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పదోన్నతుల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంది.
సింహరాశిలో బుధ సంచారం వల్ల కర్కాటక రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో బుధుడు రెండవ ఇంట్లో ఉంటాడు. దీంతో జులై 25వ తేదీ నుండి వీరికి కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు రావు. వచ్చే పరిస్థితులు లేవు. ఈ సమయంలో విజయాలను అస్సలు ఆశించవద్దు.
సింహరాశిలో బుధ సంచారం వల్ల కన్యా రాశి వారు కష్టాలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో బుధుడు సింహరాశిలో సంచరించిన తర్వాత 12వ ఇంట్లో ఉంటాడు. దీంతో జులై 25వ తేదీ నుండి ఈ రాశి జాతకులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ధన నష్టం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనేక చిరాకులు నెలకొంటాయి. ప్రయాణాలు చేయటం ఈ సమయంలో మంచిది కాదని చెప్పబడింది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన అవసరం కూడా ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications